చిత్ర పరిశ్రమలో ఎంతోమంది బాల నటులుగా తెరంగేట్రం చేస్తూంటారు. వారిలో కొంతమంది ఎదుగుతూ కూడా సినిమాల్లో నటిస్తూంటారు. వారిలో నటీనటుల కుమారులు గానీ, కుమార్తెలు గానీ అయితే వారికి మంచి స్టేటస్ కూడా ఏర్పడుతుంది. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున తన ప్రస్థానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో ఘనంగానే కొనసాగించారు. కానీ.. నాగార్జున బాల నటుడిగా ఓ చిత్రంలో కనిపించాడన్న విషయం చాలా మందికి తెలీదు.

 

 

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ సినిమాలో బాల నటుడిగా నాగార్జున చిన్నారిగా కనిపించారు. అంత చిన్న వయసులో ఆ సినిమాలో నాగేశ్వర రావు, సావిత్రి ఒడిలో ఆయన కనిపిస్తారు. ఈ విషయం ఆయన హార్డ్ కోర్ అభిమానులకు తప్ప ప్రేక్షకులకు కూడా పెద్దగా తెలీకపోవచ్చు. నాగార్జున కూడా ఈ విషయాన్ని ఎక్కువగా చెప్పి ఉండకపోవచ్చు. నాగార్జున అలా బాల నటుడిగా తెరపై కనిపించిన వెలుగు నీడలు సినిమా విడుదలై నేటితో 60 వసంతంలోకి అడుగుపెట్టింది. 1961 జనవరి 7న ఆ సినిమా విడుదలైంది. అప్పట్లో హిట్ సినిమాగా వెలుగు నీడలు నిలిచింది. నాగార్జునకు అప్పటికి ఏడాదిన్నర వయసు.

 

 

నాగార్జున పెద్దయ్యాక హీరోగా రాణించి యువసామ్రాట్ గా యూత్ కలల హీరోగా రాణించారు. ప్రస్తుతం ఆయన కింగ్ నాగార్జునగా సూపర్ స్టార్ గా ఎదిగారు. అక్కినేని నట వారసత్వం నిజంగానే ఘనమైనది అని చెప్పాలి. నాగేశ్వర రావు సినీ వారసత్వాన్ని నిలిపిన నాగార్జున తర్వాత తరం కూడా సినీ కధానాయకులుగా రాణిస్తున్నారు. వీరిలో అక్కినేని అఖిల్ కూడా తండ్రి లానే ఏడాది వయసులోనే ‘సిసింద్రీ’ సినిమా ద్వారా 1994లో తెరంగేట్రం చేశారు. తండ్రి బాటలోనే ఆయన కూడా బాల నటుడిగా అంత చిన్న వయసులోనే తెరపై కనిపించి ఘనమైన వారసత్వాన్ని చాటారని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: