త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లు. ఆయ‌న‌కు లెక్క‌లేనంత‌మంది అభిమానులున్న విష‌యం తెలిసిందే. ఒక్క త‌మిళ‌నాడు మాత్ర‌మే కాకుండా తెలుగులో కూడా ఆయ‌నకు ఫ్యాన్స్ మాములుగా లేర‌న్న విష‌యం తెలిసిందే. ఆయ‌న సినిమా విడుద‌ల‌వుతుందంటే చాలు ఆయ‌న అభిమానుల‌కు అంత‌క‌న్నా వేరే పండ‌గ ఏమీ ఉండ‌దు. తాజాగా ర‌జ‌నీకాంత్ మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం `ద‌ర్బార్‌` ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా (జ‌న‌వ‌రి 9, 2020)న విడుద‌ల కానుంది.  సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కారణంగా లైకా నిర్మాణ సంస్థ‌ సినిమాకి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తుంది. 

 

ఈ సినిమాల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ బ‌స్సులు, రైళ్ళే కాదు ఏకంగా ఫ్లైట్ల‌పై కూడా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. తాజాగా `ద‌ర్భార్` సినిమా పోస్ట‌ర్స్ కూడా విమానాల పై ద‌ర్శ‌నం ఇచ్చాయి. ఈ ఫోటోలను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే...ర‌జ‌నీకాంత్ ఏజ్ ఎంత పెరిగినా క్రేజ్ మాత్రం అస్స‌లు త‌గ్గ‌లేదు. ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రే హీరోకి లేదంటే న‌మ్మాల్సిందే. ఆయ‌న ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ పెరుగుతూనే వ‌చ్చింది. త‌మిళ‌నాడులో అయితే ధనిక – పేద తేడ లేకుండా ఆగి చూసి, దణ్ణం పెట్టుకుని వెళ్తారు. ఒకటి వినాయకుడికి , రెండు సూపర్ స్టార్ రజనీకాంత్ కటౌట్ కి. ఇందులో పొగడ్త ఏమీలేదు. రీసెంట్ గా జరిగిన, తెలుగు దర్బార్ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా, రజనీకాంత్ ఒకే ఒక్క మాటలో “తక్కువ తినండి; తక్కువ గా ఆశ పడండి” అని తనదైన స్టైల్ లో జీవిత సత్యాన్ని సింపుల్ గా చెప్పారు. ఇక న‌డిస్తేస్టైల్‌, కూర్చుంటేస్టైల్‌, ర‌జ‌నీ అంటేనే స్టైల్.. స్టైల్‌.. అయితే కానీ గ‌త కొంత కాలంగా ఆయ‌న చిత్రాల‌కు మాత్రం క‌లెక్ష‌న్లు పెద్ద‌గా ఉండ‌డంలేదు. ఎందుకోగాని ఆయ‌న తీసుకునే క‌థ‌లు తేడానా లేదంటే ఆయ‌న చిత్రాల‌కు హైప్ ఎక్కువ‌యి అలా జ‌రుగుతుందా అన్న‌ది తెలియాలి. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ వ‌రుస ఫ్లాప్‌లే క‌న‌ప‌డుతున్నాయి. కాలా, క‌బాలి, పేటా, రోబో2 అయితే భారీ బ‌డ్జెట్ సినిమా 300వంద‌ల కోట్ల చిత్రం 100కోట్లు వ‌చ్చాయి. దాదాపు 200 కోట్లు నిర్మాత న‌ష్ట‌పోయాడు. 

 

అయితే ఇద‌లా ప‌క్క‌న పెడ‌డితే వాళ్ళ క్రేజ్ ని బ‌ట్టి సినిమాలు తీసేస్తుంటారు కొంద‌రు హీరోలు. కానీ దాని వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోతుంటారు. ఎక్కువ హైప్ క్రియేట్ చేసేస్తారు ముందుగానే ఇలా హైప్ క్రియేట్ చేయ‌డం వ‌ల్ల గ‌తంలో కూడా చాలా సినిమాలే బాక్సాఫీస్ ముందు బోల్తాప‌డ్డాయి. చిరంజీవి న‌టించిన `అంజి` నాగార్జున `ఢ‌మ‌రుకం` వెంక‌టేష్ `సుభాష్‌చంద్ర‌బోస్‌`ప‌వ‌న్‌క‌ళ్యాణ్ `అజ్ఞాత‌వాసి`జూనియ‌ర్ ఎన్టీఆర్ `శ‌క్తి` అల్లుఅర్జున్ `బ‌ద్రీనాధ్‌` రాంచ‌ర‌ణ్ `ఆరంజ్‌`సొంత నిర్మాణంలో కూడా న‌ష్ట‌పోయారు. ఇలా క్రేజ్‌ని బ‌ట్టి సినిమాలు తీసుకుంటే పోవ‌డం వ‌ల్ల‌ మార్కెట్‌లో నిర్మాత‌లు న‌ష్ట‌పోతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: