తెలుగు నాట ఏ సినిమా ప్రియుడిని అడిగినా ' చెప్పాను బ్రదర్ ' వివాదం గురించి ఇట్టే చెప్పేస్తాడు .. నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ గోల ఇప్పటికీ అల్లూ అర్జున్ - పవన్ కల్యాణ్ ఫాన్స్ మధ్య నాలుగుతూనే ఉంది.

 

 

అప్పటికీ మధ్యలో అల్లూ అర్జున్ పవన్ కల్యాణ్ ని అడపా దడపా కలుస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఇది అలా ఉండిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు అల్లూ అర్జున్ ని అపార్ధం చేసుకోవడమొ లేక , నిజంగానే బన్నీ పవన్ పేరు ని పట్టించుకోకపోవడమో జరుగుతోంది. ఈ పరిస్థితిలో రీసెంట్ గా జరిగిన బన్నీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సైతం పవన్ కల్యాణ్ పేరుని ప్రస్తావించకపోవడం వివాదాస్పదం గా మారింది. బ‌న్నీ మాట్లాడుతున్న‌ప్పుడు చుట్టు ప‌క్క‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ‘ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ స్టార్‌’ అంటూ బ‌న్నీని విసిగించారు.

 

 

దాంతో.. ‘మీఅంద‌రి కోసం ప‌వ‌ర్ స్టార్ గారూ.. అంటాను. కానీ ఈ క‌ట్టె కాలేంత వ‌ర‌కూ చిరంజీవి అభిమానినే’ అంటూ ఆ ఫ్యాన్స్‌కి కౌంట‌ర్ ఇచ్చాడు బ‌న్నీ. నిజానికి చుట్టు ప‌క్కల ఎంత గొడ‌వ చేస్తున్నా బ‌న్నీ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. " మీ గురించి పవన్ పేరు చెబుతున్నా కానీ " అంటూ బన్నీ అనడం పవన్ ఫాన్స్ కి నచ్చలేదు.

 

 

సైలెంట్ గా చిరు అంటే ఇష్టం ప్రాణం అంటే అయిపోయేది కానీ ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు అంటూ మండిపడుతున్నారు పవన్ అభిన్=మానులు . మీ అంద‌రికీ ప‌వర్ స్టార్ దేవుడు కావొచ్చు.. నాకు మాత్రం కాదు అని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు క‌దా? అని ఇండస్ట్రి లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ సారి ఇలాంటి వివాదం లోంచి బన్నీ మాత్రం వెంటనే బయటకి వచ్చేలాగానే కనిపిస్తున్నాడు. పవన్ కల్యాణ్ కి ఆప్త మిత్రుడు గా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సారి పవన్ దగ్గరకి బన్నీ ని తీసుకుని వెళ్ళి అల వైకుంఠపురములో విడుదలకి ముందే పవన్ ఫాన్స్ - బన్నీ మధ్య ఏర్పడిన అగాథం తుడిచేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. సరిగ్గా విడుదలకి ముందరే ఇది జరిగేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: