తండ్రి అంటే ఏ కొడుకుకి ఐనా ఇష్టమే .. తండ్రి మీద అభిమానం ఉండడం అనేది మనందరికీ తెలిసిందే. అయితే అలా ఉండడం ఒక రకం అయితే పబ్లిక్ గా దాన్ని చాటుకోవడం, తండ్రి కోసం పబ్లిక్ గా ఏదైనా చెయ్యడం మరొక ఎత్తు. రీసెంట్ గా బన్నీ సినిమా అలా వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్ కన్సర్ట్ లో జరిగిన సీన్ అందరినీ టచ్ చేసింది అనే చెప్పాలి.

 

 

తన మనసులోని భావాల్ని అదిమి పెట్టకుండా.. అనిపించింది అనిపించినట్లుగా చెప్పేసే అల్లు అర్జున్.. తాజాగా తన మూవీ ప్రోగ్రాంలో ఓపెన్ గా చెప్పేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. అల్లు అర్జున్ మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఎవరైనా తమ కుటుంబంలోని వారికి అవార్డులు ఇవ్వాలని కోరటం ఉండదు. ఎందుకంటే.. అవార్డులు.. పురస్కారాలు అన్నవి అడిగి ఇప్పించుకోవటం కాదు.. గుర్తించి ఇవ్వాలనుకునేవి. ఒకటి మాత్రం అల్లూ అరవింద్ కానీ , అల్లూ శిరీష్ గానీ , అల్లూ అర్జున్ కానీ గుర్తు పెట్టుకోవాలి .. అడగకుండా సైలెంట్ గా ఉన్నంత మాత్రాన అవార్డులు రావు అనేది వారంతా అర్ధం చేసుకోవాల్సిన వ్యవహారం. ఒక అవార్డు కి అనేకమంది అర్హులు ఉంటారు .. అయితే తమ సొంత ప్రయత్నాలు చేయకుండా అవార్డులు ఒళ్ళోకి వచ్చి వాలడం మాత్రం అసాధ్యం అనేది అర్ధం చేసుకుంటే మంచిది అంటున్నారు విశ్లేషకులు.

 

 

 

తాము మనసు పడిన పురస్కారాల గురించి గుట్టుగా ప్రయత్నాలు చేసేసి.. సొంతం చేసుకునే ఉదంతాలు బోలెడన్ని కనిపిస్తాయి.  ఇలా బన్నీ లాగా తండ్రి మీద కావచ్చు ఇంకెవరిమీద ఐనా ప్రేమతో ఎవరూ ఇలా  చేసిన సేవలకు పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట మాత్రం ఇటీవల కాలంలో ఎవరూ చెప్పలేదని చెప్పాలి.

 

 

అల్లు అరవింద్ కు అవార్డు ఇవ్వాలన్న మాట ఆయన కొడుకు అల్లు అర్జున్ ఎందుకు అడగాలి? మరెవరు ఎందుకు అడగలేదు? అంటూ ఇండస్ట్రి లో డిస్కషన్ లు జరుగుతున్నాయి.  అల్లు అరవింద్ ను ప్రమోట్ చేసేవారెవరూ ఇండస్ట్రీలో లేరా? అనేది ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. ఇండస్ట్రి ని ముప్పై సంవత్సరాలు గా రారాజుగా ఏలుతున్న మెగాస్టార్ కి సొంత బావమరిది  , మెగాస్టార్ ఈ స్థాయి కి రావడం వెనక ఉన్న అతిపెద్ద కారణం ఐన అల్లూ అరవింద్ కి ఈ పరిస్తితి ఏంటి అని ' అయ్యో పాపం అల్లూ అరవింద్ ఆయన మాకు ఎంతో ఆదర్శం ఆయనకి ఇలా ఎవరూ సపోర్ట్ ఇవ్వకపోవడం ఏంటి .. అల్లూ అర్జున్ కోరిక నిజమే - కరక్ట్ గానే అడిగాడు ' అంటూ జాలి తో కూడిన గౌరవం చూపిస్తోంది తెలుగు ఇండస్ట్రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: