మెగాస్టార్ చిరంజీవి అనేక మంది హీరోయిన్లతో సినిమాలు చేశారు.  వారిలో అందరికంటే ఎక్కువగా విజయశాంతితో కలిసి సినిమాలు చేయడం విశేషం.  మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కలిసి 19 సినిమాలు చేశారు.  ఈ 19 సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో, ఎన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయో తెలుసుకుందాం.  


చిరంజీవి - విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా సంఘర్షణ.  సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా వచ్చింది.  అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.  ఈ సినిమాకు బెస్ట్ కలెక్షన్లు వచ్చాయి.  ఈ సినిమా తరువాత చేసిన దేవాంతకుడు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.  అయితే రెండో సినిమా సెంటిమెంట్ ఈ సినిమాకు  వర్కౌట్ అయినా కొద్దిలో బయటపడ్డారు.  ఇక మూడో సినిమాగా వచ్చిన మాహా నగరంలో మాయగాడు సినిమా పెద్దగా హిట్ కాలేకపోయినా యావరేజ్ సినిమాగా నిలిచింది.  ఈసినిమాకు విజయబాపీనీడు దర్శకత్వం వహించారు.  


ఇకపోతే, దీనితరువాత వీరిద్దరికి ఛాలెంజ్ విసిరిన సినిమా ఛాలెంజ్.  ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.  క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై ఏ కోదండరామి దర్శకత్వంలో తెరకెక్కింది.  దీని తరువాత వచ్చిన చిరంజీవి సినిమా డిజాస్టర్ గా నిలిచింది.  చిరంజీవి - విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మొదటి డిజాస్టర్ సినిమా ఇది.  ఆ తరువాత వచ్చిన కొండవీటి రాజా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.  రాఘవేంద్ర రావు ఫ్యామిలీ డ్రామా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు.  


ఆ తరువాత వచ్చిన ధైర్యవంతుడు అట్టర్ ప్లాప్ కాగా, చాణక్య శపథం డిజాస్టర్ గా నిలిచింది.  ఈ కాంబినేషన్లో రెండు పరాజయాల తరువాత వచ్చిన పసివాడి ప్రాణం సినిమా అనూహ్యంగా పుంజుకొని విజయం సాధించింది.  ఆ తరువాత చేసిన స్వయంకృషి సినిమా మంచి విజయంతో పాటుగా మెగాస్టార్ కు ఉత్తమ నటుడిగా నంది అవార్డును ఇచ్చింది.  కెరీర్లో ఇది మొదటి నంది అవార్డు.  ఆ తరువాత చేసిన మంచిదొంగ యావరేజ్ గా నిలిస్తే, యముడికి మొగుడు సినిమా సూపర్ హిట్టైంది.  యుద్దభూమి సినిమా భారీ పరాజయం పాలవ్వగా, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.  ఆ తరువాత రుద్రనేత్ర, కొండవీటి దొంగ, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు సినిమాలు చేసారు.  ఇందులో గ్యాంగ్ లీడర్ సినిమా అప్పట్లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: