టాలీవుడ్  ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్ పేరంటే గుర్తొచ్చేది సమంత. ఏం మయా చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలరించిన కేరళ కుట్టీ సమంత.. ఆ సినిమా విజయం తర్వాత ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటుంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలైంది అలా సామ్ తెలుగింటి కోడలైంది.. తెలుగమ్మాయి కూడా అయింది .. 

 

ఎవరికైనా పెళ్ళైతే సినిమాలకు దూరంగా ఉండటమొ లేక సినిమాలలో తక్కువగా కనిపించడంతో చేస్తుంటారు. కానీ, సమంత మాత్రం దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పాలి. పెళ్లైయ్యాక వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఇకపోతే సామ్ ఇప్పుడు సినిమాలలతో పాటుగా  ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. 

 


అలాగే చైతుతో కలిసి మరో చిత్రంలో సమంత కనిపించబోతున్నట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినపడుతున్నాయి.ఇదిలా ఉంటే ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌ కోసం వెళ్లిన సమంత అక్కడ చీర కట్టులోతళుక్కు మంది.ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలోసమంత షేర్ చేసింది. అందులో ఓ ఫొటోలో తన నడుము పైభాగంలో ఉన్న టాటూను బయటపెట్టేసింది సమంత. 

 


ఇది వరకే ఓ ఫొటో షూట్‌లో ఆ టాటూ కాస్త కనిపించగా.. ఇప్పుడు మొత్తాన్ని బయటపెట్టేసింది. అయితే ఆ టాటూ తన భర్త నాగ చైతన్య సంతకం కావడం విశేషం. తన భర్తపై ప్రేమతో అతడి సంతకాన్ని ఆమె నడుముకు పైభాగంలో వేయించుకోవడం అందరిని ఆకట్టుకుంది. కాగా ఈ అవార్డు వేడుకలో సూపర్ డీలక్స్ సినిమాకు గానూ ఆమెకు బెస్ట్ జ్యూరీ అవార్డు లభించింది. ప్రస్తుతం ఆ టాటూ ఉన్న సామ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఆ టాటూ ఫోటోపై ఓ లుక్ వేసుకోండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: