గద్దర్ కాలికి గజ్జెకట్టి ఆడుతుంటే అది విన్న వారి పాదాలు వారికి తెలియకుండానే ఆడుతుంటాయి. తన పాటతో ఎందరో హృదయాలను పులకింపచేశారు గద్దర్ అని చెప్పబడే గుమ్మడి విఠల్ రావు.. ఈయన రాసిన పాటలు ఎందరిలో చైత్యన్య స్పూర్తిని నింపాయి. ముఖ్యంగా ఈయన రాసిన పాటల గురించి చెప్పుకుంటే మాభూమి సినిమాలో, బండెనక బండి కట్టి. అనే పాట ప్రతి వారి పెదవిలో నిలిచిపోయింది. ఇదేగాక అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా" అనే పాటను "తెలంగాణా" రాష్ట్ర గీతంగా ఎంపిక చేసారు.

 

 

ఇలాంటి పాటలే నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ.. పొడుస్తున్న పొద్దు మీద లాంటి మొదలగు పాటలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాయి. ఇవేగాక ఎన్నో విప్లవ గీతాలు రచించారు గద్దర్. అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి గద్దర్‌తో సమావేశమైయ్యారట. ఇకపోతే గత కొంత కాలంగా ప్రజా సమస్యలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న గద్దర్‌ను రాజమౌళి కలవడం విశేషాన్ని సంతరించుకుంది.

 

 

బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఈ సినిమా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుందట. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుండగా ఇందులో ఇప్పుడొక విశేషం చోటు చేసుకోనుంది. అదేమిటంటే .. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తే .. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.

 

 

ప్రజా పోరాట వీరుడు కొమరం భీం నేపథ్యంలో సాగె కథ కోసం గద్దర్ పాటను పెడుతున్నారట. ఇందుకు గాను రాజమౌళి, గద్దర్ తో చర్చలు కూడా జరిపాడట. ఇకపోతే  గద్దర్ పాటలు అప్పట్లో తెలంగాణ పోరాటంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అందుకే ఈ సినిమాలో అయన పాటను పెడుతున్నారట. ఈ పాటను కూడా ఆయనే స్వయంగా రాస్తున్నట్టు సమాచారం. సో త్వరలోనే ఈ సాంగ్ గురించిన క్లారిటీ రానుందని తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: