'ఈ రోజుల్లో' వంటి ఒక చిన్న సినిమా అది కూడా ఒక బూతు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యాడు దాసరి మారుతి. ఆ తర్వాత 'బస్ స్టాప్' వంటి సినిమాని తీసి హిట్ కొట్టాడమేకాకుండా అప్పటినుంచి తన ప్రతీ సినిమా కు తన టాలెంట్ ను చూపించుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ప్రేమ కథా చిత్రమ్ తో మారుతి కెరీర్ టర్న్ అయ్యింది. అంతకు ముందు చేసిన సినిమాలు మారుతిని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకునేలా చేశాయి. ప్రేమ కథా చిత్రమ్ ఇంకాస్త పాపులర్ డైరెక్టర్ ని చేసింది. ప్రేమ కథ చిత్రమ్ ను సుధీర్ బాబు కోసం మహేష్ బాబు ప్రమోట్ చేసిన విషయం తెల్సిందే.

 

ఆ సమయంలో ప్రేమ కథా చిత్రమ్ మహేష్ బాబు కు బాగా నచ్చిందట. అప్పుడే నా కోసం ఒక కథను రెడీ చేయమంటూ స్వయంగా మహేష్ బాబు దర్శకుడు మారుతికి అడ్వాన్స్ కూడా ఇవ్వబోయాడట. ఆ విషయాన్ని స్వయంగా మారుతి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఆ సమయంలో అల్లు అర్జున్, మహేష్ బాబు నుండి పిలుపు వచ్చింది. కాని స్టార్ హీరోలు అంటే భారీ బడ్జెట్ కావాలి. దాంతో పాటు చాలా ఒత్తిడి ఉంటుందని.. తనకు అప్పటికే అంత అనుభవం రాలేదని అనుకున్నాను. నాపై అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లేకపోవడంతో వారితో సినిమాలు చేసే సాహసం చేయలేదు.

 

ప్రతి రోజు పండుగే సినిమా కోసం 30 మంది పెద్ద ఆర్టిస్టులను మేనేజ్ చేయడంతో పాటు ఇప్పుడు వారిని డైరెక్ట్ చేసి ఒక మంచి సినిమా చేయగలను అనే నమ్మకం నాపై నాకు కలిగింది. అందుకే ఇప్పుడు వారి కోసం కథలు సిద్దం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మరి అప్పుడు పిలిచి ఛాన్స్ ఇస్తామన్న అల్లు అర్జున్, మహేష్ బాబు లు ఇప్పుడు మారుతి కథ విని ఓకే చెప్పే అవకాశం ఉందా అనేది కాస్త అనుమానమే. మంచి కథ తో వస్తే కొత్త వారితో అయినా చేసేందుకు వీరిద్దరు ఓకే చెప్తారు. అలాంటిది మారుతి మంచి కథతో వారిని ఆకట్టుకుంటే తప్పకుండా ఒప్పుకుంటారనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మారుతి ప్రయత్నాఉ బాగానే చేస్తున్నాడు. టార్గెట్ కూడా పెద్దదే. మరి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: