అల్లుఅర్జున్ కధానాయకుడిగా పూజ హెగ్డే కధానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆలా వైకుంఠపురములో. ఇప్పటికే విడుదలైన పాటలు.. టీజర్, ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది. బన్నీ అభిమానులు కూడా ఇప్పటికే ఈ సినిమాపై తారాస్థాయిలో నమ్మకం పెట్టేసుకున్నారు. 

 

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ .. ఈ మధ్యకాలంలో ఏ సినిమా తీసినా అన్ని కాపీ అని అంటున్నారు. మీరు ఏ గమనించండి.. త్రివిక్రమ్ గతంలో తీసిన సినిమాలు అన్ని ఒక్కొక్కటిగా వద్దాం.. 'అ ఆ' సినిమా సమంత, నితిన్ హీరోహీరోయిన్లగా తెరకెక్కిన సినిమా.. ఈ సినిమా కథను ఓ పాత పుస్తకం నుండి దొంగిలించాడు అని అప్పట్లో ఆరోపణలు వచ్చయి. 

 

ఆ తర్వాత మొన్నటి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన సినిమా అజ్ఞాతవాసి. ఆ సినిమా కూడా ఫ్రెంచ్ సినిమాకు కాపీ అని తేలిపోయింది. ఇంకా ఈ మధ్యే అరవింద్ సామెత అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా తీశారు. ఆ సినిమా కథ కూడా నాది అంటూ కొందరు రాయలసీమ రచయతలు కేసులు వేశారు. ఇలా త్రివిక్రమ్ పై ఇన్నిజరిగాయి. 

 

అయితే ఇప్పుడు.. పక్కవారి కథలు కపి ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. తన సినిమాలే అన్ని మిక్స్ చేసి ఒక సినిమాను తయారు చేసినట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది.. అది ఎలా అంటారా ? ఇలానే చుడండి.. సినిమాలో బ‌న్నీ వెళుతుంటే... అల వైకుఠ‌పురంలో అన్న నివాసం పేరు ఉంటుంది.. ఇది అత్తారింటికి దారేదిలో సునంద నిల‌యం ముందు ప‌వ‌న్ ఉన్న సీన్ గుర్తు చేస్తుంది.. 

 

ఇంకా అల్లు అర్జున్.. తండ్రితో మాట్లాడే సన్నివేశాలు.. ఆ డైలాగులు చూస్తే.. జులాయి సినిమా గుర్తొస్తుంది. ఇంకా హీరోయిన్ వెంట పడే సీన్ కూడా ఇలియానా వెంట అల్లు అర్జున్ జులాయిలో పడినట్టే ఇక్కడ పూజ హెగ్డే వెనుక అన్నట్టు కనిపిస్తుంది. ఇలా చాలా సీన్లు కాపీ తన సినిమా నుండే కాపీ కొట్టేసినట్టు కనిపిస్తుంది.. మరి ఈ కాపీ పేస్ట్ మంచి కాఫీ లాంటి సినిమా అవుతుందా ?  లేదా ? అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: