జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వచ్చేసిన మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘అదిరింది’ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో తొలి ఎపిసోడ్  ఆదివారం డిసెంబర్ 22న ప్రసారం అయిన సంగ‌తి తెలిసిందే. అయితే కేవలం జడ్జిగా మాత్రమే కాకుండా ఈ షో ప్రమోషన్స్ మొత్తంతో పాటు టీం లీడర్స్ బాధ్యతల్ని కూడా భుజాన వేసుకున్నాడు మెగా బ్ర‌ద‌ర్‌. దాదాపు ఏడేళ్లు పాటు ఈటీవీ ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఇప్పుడు ఇదే షోకు పోటీగా వెళ్తున్నారు. ఇక జీ టివిలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు వస్తున్నా ఈ షో పై చాలా ఆశలు పెట్టుకున్నారు. 

 

కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ ఈ షో తక్కువ రేటింగ్ తెచ్చుకుని టెన్షన్ పెట్టింది. అయితే ఈ షో జబర్దస్త్ ను అందుకోలేదు సరికదా .. కనీసం దాని దగ్గరలో కూడా రేటింగ్ తెచ్చుకోలేకపోయింది. జబర్దస్త్ టివి షో 6, 7 రేటింగ్ లో ఉంటే  అదిరింది మాత్రం 0 . 5 రేటింగ్ లోనే ఉండడంతో ఈ షో పై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈ రేటింగ్ చాలా పూర్ అని చెప్పాలి. జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వంటి వారు వచ్చి పోగ్రాం చేసినా ఈ స్దాయిలో దెబ్బ కొట్టడం ఎవరూ ఊహించలేదు. మ‌రి ఈ షో ప్లాపా అంటే అది చెప్పలేం. 

 

ఎందుకంటే జబర్దస్త్ షో దాదాపు ఏడేళ్లుగా ప్రసారం అవుతుంది .. అదిరింది షో ఈ మద్యే కొత్తగా మొదలైంది కాబట్టి ముందు ముందు రేటింగ్ పెరిగే అవకాశం ఉండొచ్చు. కాగా, నాగబాబు తో పాటు చమ్మక్ చంద్ర, ధనరాజ్, వేణు, కిరాక్ ఆర్పీ లతో అదిరింది షో స్టాట్ అయింది. ఇక జబర్దస్త్ కి జిరాక్స్ లా అనిపించిందని నాగబాబు అభిమానులే అంటున్నారు. లోగో దగ్గర నుంచి  స్కిట్ ల వరకూ జబర్దస్త్ కి కొనసాగింపులా ఉంది తప్ప మరో కొత్త షో చూసిన అనుభూతి దక్కలేదని వీక్షకులు పెదవి విరుస్తున్నారు. మ‌రి ఈ షో ముందు ముందు ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: