కాలం కొద్దీ ప్రతి రంగంలోనూ మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే సినిమా విజయానికి కొలమానంగా అప్పట్లో ఎన్ని రోజులు ఆడింది అని చెబితే ఇప్పుడు ఎంత వసూలు చేసింది అని లెక్కిస్తున్నారు. అలాగే డిజిటల్ న్యూస్ మరియు లైక్స్ లో హీరో కి ఉన్న క్రేజ్ ను చెప్తుంటారు.

 

సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్ బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు సినిమా' మెగాసూపర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక కమర్షియల్ చిత్రానికి కావలసిన అన్ని హంగులూ పూనుకున్న మాస్ ట్రైలర్ తో ఫ్యాన్స్ కు చాలా ఊపు వచ్చింది. ఇక మహేష్ అభిమానులు అంతా ఊపుని యూట్యూబ్ పైన చూపించారు. యూట్యూబ్ లో వ్యూస్ మరియు లైక్స్ పరంగా 3 ప్లేస్ ను మరియు 4 స్థానాన్ని వరుసగా సొంతం చేసుకుంది సరిలేరు నీకెవ్వరు.. బాహుబలి2, సాహో మరియి అరవింద సమేత తర్వాత స్థానాల్లో సరిలేరు వ్యూస్ పరంగా నిలిచింది.

 

24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ – 5 మూవీస్:

 

1. బాహుబలి 2 – 21.81 మిలియన్

2. సాహో – 12.32 మిలియన్

3. అరవింద సమేత వీర రాఘవ – 7.8 మిలియన్

4. సరిలేరు నీకెవ్వరు – 7.4 మిలియన్

5. మహర్షి – 7.31 మిలియన్

 

24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టాప్ – 5 మూవీస్:

 

1. బాహుబలి 2 – 497కె

2. సాహో – 392 కె

3. సరిలేరు నీకెవ్వరు – 347 కె

4. సైరా – 341కె

5. అరవింద సమేత వీర రాఘవ – 327కె

 

మరింత సమాచారం తెలుసుకోండి: