స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్  సినిమా 'అలవైకుంఠపురములో'. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మ్యూజిక్ కన్సర్ట్ పేరుతో రీసెంట్‌గా హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు. 

 

ఈ మ్యూజికల్ కన్సర్ట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతు .. నేను చిరంజీవి అభిమానిని అని చెప్పుకున్నాడు. 'ఈ కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యానే. అంటూ త్రివిక్రం రాసిచ్చినట్టుగా పెద్ద డైలాగ్ కూడా కొట్టాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది. ఆ తర్వాతే బన్నీ వాయిస్ లో బేస్ మారింది. చిరు తర్వాత తనకు ఇష్టమైన వ్యక్తి అంటూ చిన్న గ్యాప్ ఇచ్చాడు. 


'నాకు చిరంజీవి గారంటే ప్రాణం. ఈ కట్టె కాలేంత వ‌ర‌కు చిరంజీవిగారి అభిమానినే. చిరంజీవిగారి త‌ర్వాత నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి ర‌జినీకాంత్‌ గారే. అలాంటి ర‌జినీకాంత్‌ గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌ గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి ఆయ‌న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను'.

 

అని బన్నీ తన వెర్షన్ ని వినిపించాడు. కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ పేరును లెక్కలెనన్ని సార్లు చెప్పిన అల్లు అర్జున్.. గత కొంతకాలంగా పవన్ పేరు ప్రస్తావించడం మానేశాడు. ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా "చెప్పను బ్రదర్" అంటూ పవన్ ఫ్యాన్స్ పై చిరాకు పడ్డాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఓ 2 సార్లు పవన్ ను బన్నీ కౌగిలించుకున్నాడు. దీంతో ఇద్దరూ కలిసిపోయారని అందరు భ్రమ పడ్డారు. కానీ కాదని అల మ్యూజికల్ నైట్ లో అర్థమైపోయింది.

అల ఫంక్షన్ లో బన్నీ మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. తనకు పవన్ ఫ్యాన్స్ అక్కర్లేదనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఈవెంట్ లో ఒకానొక సందర్భంలో పవర్ స్టార్.. పవర్ స్టార్ అనే అరుపులులు వినిపించినప్పటికీ బన్నీ వినిపించుకోలేదు. 'అందర్నీ రౌండ్ వేస్తా బ్రదర్, కాస్త ఆగు' అని మాత్రమే అన్నాడు. ఆ తర్వాత పవన్ స్థానంలో రజనీకాంత్ పేరు చెప్పి చిన్న షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రోజు నుంచి బన్నీ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి బన్ని బాబాయ్ ఒద్దా ..ఏమైంది ..ఎందుకని ..అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. మరి వీటికి బన్నీ సమాధానం ఏమని చెప్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: