టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న నటుడు సూర్య తాజాగా ఆకాశమే నీ హద్దురా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  గజినీ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సూర్య తర్వాత సింగం సీరీస్ తో మరింత దగ్గరయ్యాడు.  తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా.ఇక ఒక లక్ష్యం పెట్టుకొని ఎదగాలని ప్రయత్నం చేసే వ్యక్తి పాత్రలో ఇందులో సూర్య నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ టీజర్ కాస్తా మొటివేటింగ్ గా ఉంది.  జేబులో ఆరువేలు పెట్టుకుని ఏరో ప్లెయిన్ కంపెనీ పెడ‌దామ‌ని ఒక‌డొస్తే, ఎవ‌డ్రా ఈ వీపీగాడు అని ఈ లోకం వాడ్ని చూసి న‌వ్వింది అంటూ మోహ‌న్‌బాబు డైలాగ్‌తో ఈ టీజ‌ర్ మొద‌లైంది.

 

పైలెట్ ఆఫీస‌ర్ చంద్ర‌మ‌హేష్‌గా ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నాడు ఇక విమానయాన కంపెనీ పెట్టాలని ఉద్యోగాన్ని వదిలేసి తన లైఫ్ లో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ సాగే పాత్రలో సూర్య‌ కనిపించాడు.ఇక తన లక్ష్యాలతో విజ‌యం వైపు ఎలా ప‌రుగులు తీశాడు అనే ఎలిమెంట్ ని దర్శకురాలు సుధ కొంగర చాలా నేచురల్గా సహజత్వానికి దగ్గరగా ఉండే విధంగా ఆవిష్కరించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

 

ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లోనే కథ మొత్తం రివీల్‌ చేసేశారు చిత్రయూనిట్‌. శిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్‌ తో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అపర్ణ బాలమురళి, పరేశ్‌ రావల్‌, ఊర్మశి, వివేక్‌ ప్రసన్న, కాళీ వెంకట్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్‌ డేట్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడించనున్నారు. టీజర్ చూస్తుంటా ఎంతో ఆకట్టుకుంటుంది. మరి సూర్య ఈ మూవీతో మంచి విజయం అందుకుంటాడో లేదో చూాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: