బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కి ఇంతవరకు పెళ్ళి కానేలేదు. కానీ లవర్స్ అనాలో గాళ్ ఫ్రెండ్స్ అనాలో తెలీదు గాని చాలామందే ఉన్నారు. తను పరిచయం చేసిన హీరోయిన్స్ అందరితోను ఎఫైర్ ఉందని బాలీవుడ్ లో మీడియాలో విపరీతంగా రాసేస్తుంటారు. దానికి సల్మాన్ కూడా కాస్త ఎక్కువగానే బలాన్ని చేకూరుస్తుంటాడు. అయితే మన కండల వీరుడులో ఒక గొప్ప క్వాలిటి ఉంది. అదేంటంటే తనకు బాగా ఇష్టమైన వాళ్లకు బహుమతులు ఇవ్వడం సల్మాన్ ఖాన్ స్పెషాలిటి అండ్ హాబీ. తను పని చేసిన సినిమా యూనిట్ లో కీలక సభ్యులకు, లేదంటే తన ఫిల్మీ ఫ్రెండ్స్ కు ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇస్తుంటాడు ఈ కండల హీరో. ఇప్పుడీ లిస్ట్ లోకి ఓ సౌత్ హీరో కూడా చేరాడు. అతనే కన్నడ హీరో కిచ్చా సుదీప్.

 

షాకవుతున్నారా..నిజమే ఈ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నుంచి ఊహించని బహుమతిని అందుకున్నాడు ఈ కన్నడ నటుడు. సుదీప్ కు ఏకంగా బీఎండబ్ల్యూ ఎమ్-5 కారును గిఫ్ట్ గా అందించాడు సల్మాన్. అంతేనా నేరుగాతనే స్వయంగా సుదీప్ ఇంటికి వెళ్లి కారును అందించాడు. ఊహించని విధంగా సల్మాన్ తన ఇంటికి రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు మన "ఈగ" విలన్. మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందంటూ స్టార్ట్ చేసి, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సుదీప్. కొత్త కారులో సల్మాన్ తో కలిసి దిగిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేశాడు. ఈ సిరీస్ కారు ప్రారంభ ధర కోటి 55 లక్షల రూపాయలు.

 

సల్మాన్ తో కలిసి దబంగ్-3 సినిమా చేశాడు సుదీప్. ప్రభుదేవా డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విలన్ గా నటించాడు. అలా సల్మాన్-సుదీప్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సల్మాన్ నుంచి గిఫ్ట్ అందుకోవడం సుదీప్ కు ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకుముందు తన సొంత కలెక్షన్ నుంచి ఓ లెదర్ జాకెట్ ను సుదీప్ కు ఇచ్చాడు సల్మాన్. మొత్తానికి సుదీప్ సల్మాన్ కి అత్యంత సన్నిహితుడయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ తర్వాత సుదీప్ సల్మాన్ కి మంచి ఫ్రెండ్ అయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: