కొంతమంది సీనియర్ హీరోలకి ఇప్పటి హీరో హీరోయిన్స్ చూస్తే అబ్బా..మా టైం లో మాకు ఇలాంటి ఛాన్స్ రానేలేదు వచ్చి ఉంటేనా నా సామి రంగా ...చమటలే అనుకొని చల్లబడే వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరో అనిల్ కపూర్ ఉండటం ఆసకికరం. 60 ఏళ్ల వయసులో ముద్దు సీన్ల కోసం తెగ ఆరాటపడుతున్నారు. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మలంగ్'. ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ హీరో హీరోయిన్స్ గా నటించారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో ఆదిత్య, దిశల మధ్య గాఢమైన ప్రేమను చూపించడానికి తెగ కిస్సింగ్ సీన్లను గట్టిగా ఇరికించారు. దీని గురించి ఓ విలేకరి అనిల్ కపూర్‌ను.. 'మీతో పాటు నటించిన ఆదిత్య, దిశల మధ్య కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి కదా. మీకు ఆ ఛాన్స్ లేదని బాధపడుతున్నారా?' అని అడిగారు.

 

పాపం అందుకు అనిల్ .. 'ఇంట్లో నా కూతుళ్లు, భార్య ఉన్నారు. ఈ ప్రశ్నలు అడిగి నేను ఇంటికి వెళ్లగానే నన్ను చావగొట్టాలని మీరు అనుకుంటున్నారా ..! అంటూనే .. నిజం చెప్పాలంటే నాకు కిస్సింగ్ సన్నివేశాల్లో నటించే అవకాశం రానందుకు బాధగానే ఉంది. ఈ సినిమాలో ఆదిత్య, దిశ బైక్ రైడ్స్‌తో చాలా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా కుర్రాడిని అయివుంటే వారిలాగే నేనూ ఎంజాయ్ చేసేవాడిని' అని తనలోని కోరికను బయటపెట్టారు. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. 'ఆషికి 2', 'ఏక్ విలన్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కాబోతోంది.

 

ఇక ఈ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీల అండర్ వాటర్ కిస్సింగ్ సీన్ హైలైట్‌గా నిలవనుందట. దీనికోసం హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ కూడా ఇచ్చారట. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. అంతసేపు అండర్‌ వాటర్‌లో నటించేందుకు వారి లంగ్‌స్ కెపాసిటీని పెంచేందుకు ఈ ట్రైనింగ్ తీసుకున్నారట. సింగిల్‌ షాట్‌లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారట. మరి ఈ సీన్ ఇమ్రాన్ హష్మీ ముద్దు సీన్ కంటే గొప్పగా ఉంటుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: