ఎప్పుడూ తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు తన ట్విటర్‌ ప్రొఫైల్‌ ఫోటోనే కారణమైంది. ఆదివారం  అనురాగ్‌ తన ట్విటర్‌ ప్రొఫైల్‌ ఫోటోను మార్చారు. ఇందులో ఏముంది అని అందరూ తేలిగ్గా అనుకోకండి.. తన పాత పిక్చర్‌ను మార్చి మాస్క్‌లు ధరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రిఅమిషాల ఫోటోను ఆయన ట్విటర్‌ ప్రొఫైల్‌ పెట్టారు. ఆదివారం జరిగిన ఢిల్లీలో జేఎన్‌యూ క్యాంపస్‌లో  దుండగుల దాడిని వ్యతిరేకిస్తూ.. నిజానికి అనురాగ్ ఈ ట్విటర్‌ ప్రొఫైల్‌ మోదీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ  ఈ ఫోటోను ఆయన  పెట్టారు.

 

కాగా ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన దుండగులు  జేఎన్‌యూ క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై, ఉపాద్యాయులపై దాడికి దిగిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే అధికార బీజేపీ ఇలా ముసుగులు ధరించి ఎవరికీ తెలియకుండాప్రజలపై దాడికి పాల్పడుతోందన్న ఉద్దేశంతో అనురాగ్‌ ఇలా చేసినట్లుగా  దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

 

ఇక ఈ దాడిని నిరసిస్తూ ప్రతిపక్షాలు, బాలీవుడ్‌ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిన్న(జనవరి 6)రాత్రి ముంబైలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలో అనురాగ్‌ కశ్యప్‌ కూడా పాల్గొన్నారు. ఇక అనురాగ్‌ పెట్టిన ఈ ఫోటోకు  వేల మంది లైకులు కొట్టడంతోపాటు, అనేకమంది దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫైల్‌ ఫోటోను మార్చడంతో కొంతమంది అనురాగ్‌ను ట్రోల్‌ కూడా చేస్తున్నారు.

 

అయితే అత్యధిక మంది ‘స్టాండ్‌ విత్‌ అనురాగ్‌ కశ్యప్‌’ హ్యష్‌ట్యాగ్‌తో...అనురాగ్‌కు మద్దతు కూడా  తెలుపుతున్నారు. ‘‘ మీ ప్రతి ట్వీట్‌ మమ్మల్నీ ప్రేరేపిస్తోంది. గర్వంగా ఉంది సార్,  దాడి తప్పు అని ప్రజలకు తెలిసినా..వారు మౌనంగా ఉన్నారు. వారికి చెడుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు’’ అంటూ నెటిజన్లు కామెంట్‌ పెడుతూ.. అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: