సూపర్ స్టార్ రజనీకాంత్-నయనతార హీరో హీరోయిన్స్ గా సెన్షేషనల్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ రిలీజ్ కు టైం దగ్గర పడింది. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబట్టి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లను పూల దండలతో సిద్దం చేస్తున్నారు. ఇక రజనీ ఫ్యాన్స్ థియేటర్ ముందు సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పొంగల్ కి తమిళనాడు లో రిలీజ్ అవుతోన్న ఒకే ఒక్క స్టార్ హీరో సినిమా కావడంతో అందరు ఆసక్తిగా ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. దర్బార్ బ్లాక్ బస్టర్ అవుతుందని రజనీ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే రజనీ తో పాటు ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది కోర్ట్.

 

సరిగ్గా రిలీజ్ కి కొన్ని గంటలు మాత్రమే ఉన్న దర్బార్ చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది. దర్బార్ మలేషియా రిలీజ్ కి బ్రేక్ వేస్తూ తాజాగా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇంతలోనే అసలేమైంది? అని ఆరా తీస్తే.. 2.0 కి సంబంధించిన పాత బకాయిల్ని చెల్లించకుండానే మలేషియాలో దర్బార్ రిలీజ్ చేయడం కుదరదని తాజాగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.

 

తలైవా శంకర్ దర్శకత్వంలో నటించిన గత సినిమా 2.0 మలేషియాలో అత్యంత భారీగా రిలీజైంది. అయితే అక్కడ రిలీజ్ చేసిన సంస్థకు లైకా వాళ్లు దాదాపు 23 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తాన్నిక్లియర్ చేయకపోవడమే ఇప్పుడు దర్బార్ కి చిక్కులు తెచ్చి పెడుతోంది. పాత బకాయి చెల్లించకపోవడం వల్లనే మలేషియన్ కంపెనీ దర్బార్ రిలీజ్ ని ఆపేందుకు స్టే విధించాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దానిని విచారించిన కోర్టు తక్షణం మలేషియా రిలీజ్ ని నిలిపివేసింది. 4.90 కోట్లు డిపాజిట్ చేశాకే రిలీజ్ కి అనుమతి ఉంటుందని కోర్టు తీర్పును వెలువరించింది. ఆ డిపాజిట్ క్లియర్ చేసి లైకా సంస్థ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవహారం ఎంత త్వరగా తేలితే అంత మంచిది. లేదంటే రజనీ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోవడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: