‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో ప్రస్తుతం యూట్యూబ్ లో అది నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ఉన్న కామెడీకి చాలమంది కనెక్ట్ అవుతున్నారు. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారం మొదలైపోయి ఈసినిమా సాధించబోయే రికార్డుల గురించి అప్పుడే అంచనాలు మొదలు పెట్టేసారు.

ఈ ప్రచారం ఇలా కొనసాగుతూ ఉంటే ఈ సినిమా కథకు సంబంధించిన ఒక లీక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను కూడ ఆశ్చర్యపరుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు’ కథలో ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ ఛాయలు ఉంటాయని అంటున్నారు. 

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ 1993 సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ కావడమే కాకుండా ఎన్టీఆర్ క్రేజ్ ఇంకా ఉంది అని నిరూపించబడి 1994 ఎన్నికలలో ఎన్టీఆర్ ఘనవిజయం సాధించేలా సహకరించింది. ఆ మూవీలోని మేజర్ చంద్రకాంత్ పాత్రకు ఉన్న ఆవేశం చైతన్యం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో పోషిస్తున్న మేజర్ పాత్రలో కూడ ఉంటుందని అంటున్నారు.

అంతేకాదు వార్ లో చనిపోయిన తన మిత్రుడుకి ఇచ్చిన మాటకోసం కర్నూలు రావడం అక్కడ విజయశాంతిని కలవడం ఒక సామాజిక పోరాటం కోసం ఆమెతో చేయికలిపి చేసిన పోరాట సన్నివేశాలు చూస్తే ‘అతడు’ మూవీలో తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి కోసం పార్ధు పాత్రలో నాజర్ వద్దకు వచ్చిన సీన్స్ గుర్తుకు వస్తాయి అని అంటున్నారు. ఇలాంటి ఛాయలు ఉన్న కథకు ఫస్ట్ హాఫ్ లోరైలు కామెడీ సెకండ్ హాఫ్ లో ఎలుక కామెడీలు జోడించి తనదైన మార్క్ లో అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ తీసాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈమూవీకి మేజర్ చంద్రకాంత్ స్ఫూర్తి అంటూ వస్తున్న లీకులనుజూనియర్ తన సన్నిహితులు ద్వారా తెలుసుకుని షాక్ అయినట్లు టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: