మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలో ఎవరి రుణం అయినా ఉంచుకుంటే లావెక్కిపోతారు అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్ ను మహేష్ కు గుర్తుకు చేస్తూ అల్లు అర్జున్ ఋణం తీర్చుకోమని బన్నీ అభిమానులు మహేష్ పై ఒత్తిడి చేస్తున్నారు. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే మొన్న జరిగిన ‘అల వైకుంఠపురములో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ మాట్లాడుతూ తన సినిమాతో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎంత మంచి వాడవురా’ ఘన విజయం సాధించాలని ఓపెన్ గా కోరుకుంటూ తన మంచి మనసు చాటుకున్నాడు. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ ఫంక్షన్ లో మహేష్ మాత్రం ‘అల వైకుంఠపురములో’ మూవీ ప్రస్తావన తీసుకు రాకపోవడమే కాకుండా సంక్రాంతికి వచ్చే సినిమాల గురించి ఒక్క మాట కూడ మాట్లాడలేదు. 

దీనితో సభ్యత సంస్కారం తమ హీరో అల్లు అర్జున్ ను చూసి నేర్చుకోమని బన్నీ అభిమానులు మహేష్ కు మెసేజ్ లు పెడుతూ ఋణం తీర్చుకోలేకపోతే లావు అయిపోతావు అంటూ మహేష్ ను కార్నర్ చేస్తున్నారు. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ కు సంబంధించి మహేష్ ఈ వారంలో ఇవ్వబోయే మీడియా ఇంటర్వ్యూలలో అయినా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ప్రస్తావన తీసుకు వచ్చి అతడికి అభినందనలు తెలియ చేస్తాడా లేదా అన్న ఆసక్తి బన్నీ అభిమానులలో బాగా పెరిగి పోయింది.

ఇప్పటికే సంక్రాంతి వార్ బన్నీ మహేష్ ల ఇగో వార్ గా మారిన నేపధ్యంలో ఈ వార్ లో ముందుగా విడుదల అవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ పై బన్నీ అభిమానులు నెగిటివ్ టాక్ ప్రచారం చేసే ఆస్కారం ఉంది. దీనితో కొంత వరకు బన్నీ అభిమానులను జోష్ లో పెట్టడానికి మహేష్ వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీ కూడ సక్సస్ కావాలని ఓపెన్ గా చెప్పి బన్నీ అభిమానుల కోరికను తీరుస్తాడో లేదో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: