దర్శకుడు రాజమౌళి ఈగ సినిమాతో సరికొత్త ప్రయోగం చేసి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమాను అంతర్జాతీయ స్దాయిలో నిలబెట్టాడు. అంత పెట్ట హిట్ ఇచ్చాక, ఆదర్శకుడి నెక్స్ట్ చిత్రం పై అంచనాలు మామూలుగా ఉండవు. ఆ అంచనాలకు అందుకునే విధంగా ప్రపంచ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి భారీ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. అదే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ...  

 

 

టాలీవుడ్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని పాజిటివ్ బజ్‌తో మాసివ్ మల్టీస్టారర్‌‌గా, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుండి, నిత్యం వార్తల్లో నిలుస్తుంది. దర్శకుడు కూడా ఈ మూవీకి సంబంధించిన విషయాలను ఎక్కువగా బయటకు పొక్కకుండా చూసుకుంటున్నారు. ఈ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం విషయంలో బయ్యర్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఎలాగైనా ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకోవడానికి రేటు ఎంతైనా పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు.

 

 

ఈ క్రమంలో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను 76 కోట్ల భారీ రేటు పెట్టి ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియా నుండి ఈ రేటు అత్యధికం కావడం విశేషం. గతంలో బాహుబలి 2 చిత్రానికి 70 కోట్ల మేర బిజినెస్ జరగగా, ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. ఇక మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో సాహో (42 కోట్లు), దర్బార్ (38 కోట్లు), పేట (34.5 కోట్లు) ఉన్నాయి.

 

 

ఇదే కాకుండా ఇప్పటి వరకు సౌత్ ఇండియా వరకూ అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా బాహుబలి 2 నిలిచింది. దాని రికార్డ్‌ను ఆర్.ఆర్.ఆర్ చిత్రం తుడిచి పెట్టింది. ఈ సినిమాకు ఇంత బజ్ రావడానికి కారణం ఏంటంటే తెలుగులో టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం. ఈ చిత్రాన్ని రాజమౌళి డైరెక్ట్ చేయడం విశేషం.

 

 

అందుకే ఈ చిత్ర రిలీజ్ కు ఇంకా చాలా రోజులుండగానే బయ్యర్లలో పోటీని పెంచింది. మరి ఎంత ఒత్తిడైనా తట్టుకుని ప్రేక్షకులని రంజింపజేసేలా సినిమాలను తెరకెక్కించే రాజమౌళి, ఈసారి ఆర్.ఆర్.ఆర్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి అని అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: