సంక్రాంతి రేస్ లో చివరిగా సంక్రాంతి రోజున రాబోతున్న ‘ఎంత మంచి వాడవురా’ మూవీకి సెన్సార్ వర్గాలు క్లీన్ సర్టిఫికేట్ ‘యు’ ఇవ్వడమే కాకుండా ఈమూవీ పై విపరీతమైన ప్రశంసలు కురిపించారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలను అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లను కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్.

వాస్తవానికి సంక్రాంతి రేసు సినిమాలలో అతితక్కువ బడ్జెట్ తో నిర్మింప బడ్డ మూవీ ‘ఎంత మంచి వాడవురా’ ఈసినిమా కనీస విజయం నయోదు చేసుకుంటే చాలు ఒక వారంలోనే ఈసినిమా లాభాలలోకి వచేస్తుంది. దీనికితోడు కళ్యాణ్ రామ్ కు ఇండస్ట్రీలో కానీ టాప్ హీరోల అభిమానులలో కానీ ఎవరు శత్రువులు లేరు. దీనితో ఈసినిమా పై ఎవరు నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయరు. అయితే మహేష్ బన్నీల సినిమాల పరిస్థితి చాల డిఫరెంట్. వారి సినిమాలు బాగున్నా ఆసినిమాలను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. 

దీనికితోడు కళ్యాణ్ రామ్ సినిమాను చూసిన తరువాత సెన్సార్ వర్గాలు వ్యక్త పరిచిన అభిప్రాయాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల రన్ టైం ఉన్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ నటన వెన్నెల కిషోర్ కామెడీ సాంగ్స్ సుహాసిని తనికెళ్ళ భరణి ల ఎమోషనల్ సన్నివేశాలు ఈసినిమాకు ప్లెస్ పాయింట్ గా మారి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు టాక్. 

ఇక ఈసినిమాలో వచ్చే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు గోదావరి ఫైట్ కూడా మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. ముఖ్యంగా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఈసినిమాకు అందించిన డైలాగ్స్ చాల హార్ట్ టచ్చింగ్ గా ఉండటంతో ఎవరు ఊహించని విధంగా అందర్నీ సర్ ప్రైజ్ చేస్తూ ఈమూవీ పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని హిట్ అవుతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం జూనియర్ స్వయంగా రంగంలోకి దిగి మీడియాలో కళ్యాణ్ రామ్ తో కలిసి ఈమూవీ కోసం చేయబోతున్న ప్రమోషన్ ఈసినిమాకు ప్లస్ గా మారే ఆస్కారం కనిపిస్తోంది..  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: