అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. అదే సమయంలో ఒక్క రోజు తేడాతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా రాబోతుంది. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ రెండు సినిమాల మధ్య లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమా విడుదల కాబోతుంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచి వాడవురా చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనుల్ని పూర్తి చేసుకోగా... సెన్సార్ నుంచి ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. అయితే ఫ్యామిలీ ఫుల్  ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో... కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్  నటిస్తోంది. 

 

 

 అయితే బాక్సాఫీస్ వద్ద బడా హీరోల సినిమాలతో భారీ పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా జనవరి 15న విడుదలై మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాతో ఉంది. కుటుంబ కథా నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇకపోతే ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది అదే ఈ సినిమా రన్ టైం. ఈ సినిమా రన్ టైం రెండు గంటల 22 నిమిషాలకు ఫిక్స్ చేశారు చిత్ర బృందం. అయితే మామూలుగానే సినిమాలకు రన్ టైం చాలా ఇంపార్టెంట్ అని సినీ  విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు రన్  టైం బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేవలం రెండున్నర గంటల లోపు సినిమా ఉంటే  ప్రేక్షకులు బాగా ఆస్వాదించడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. సరిలేరు నీకెవ్వరు అలా వైకుంఠపురములో లాంటి సినిమాలతో పోలిస్తే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమా ఎంత మంచి వాడవురా రన్ టైం తక్కువగా ఉంది. 

 

 

 

 గతంలో కూడా చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ 150... నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాల్లో మధ్యలో విడుదలైన చిన్న హీరో శర్వానంద్ సినిమా శతమానంభవతి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎంత మంచివాడురా సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఇక ఈ సినిమాకు ఎలాగో  నందమూరి ఫాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కథ కథనం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటే  అన్ని వర్గాల నుంచి ఈ సినిమా కు సపోర్ట్ లభిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా రన్ టైం కూడా తక్కువగా ఉండటంతో ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. కాగా ఈ సినిమా సతీష్ విగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కింది. చూడాలి మరి రెండు బడా  సినిమాల మధ్య వస్తున్న ఎంత మంచివాడు సినిమా ఎలాంటి విజయం సాధిస్తుం

మరింత సమాచారం తెలుసుకోండి: