ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో అంశాలు వైరల్ అవుతున్నాయి.  ఇందులో మంచి కొంత అయితే.. చెడు ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇక పాజిటివ్ అంశాల మీద రియాక్ట్ కావటం.. అదే పనిగా సోషల్ మీడియాలో ట్వీట్లు.. పోస్టులు.. స్టోరీలు పెట్టేయటం ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీ లు చేస్తున్నదే. ఈ మద్య కాలంలో సినీ సెలబ్రెటీలు దేశంలో జరిగే వివిధ అంశాల్ని  మైలేజీ వస్తుందనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలోకి తమదైన స్టైల్లో సంచల వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పెద్ద షాక్ తగిలింది.  వర్సిటీ క్యాంప్ లో జరిగిన దాడికి వ్యతిరేకంగా.. విద్యార్థులకు మద్దతుగా దీపిక అక్కడకు వెళ్లారు.

 

ముసుగులు వేసుకుని వ‌చ్చి విద్యార్థుల‌పై ఢిల్లీలోని జేఎన్‌యూలో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ దాడిలో దాదాపు 30 మందికి పైగా విద్యార్థులు ఈ దాడిలో గాయపడ్డారు.  ఘ‌ట‌న‌ని ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు ఖండించారు. అయితే దీపికా పదుకొనె మాత్రం ఏకంగా జేఎన్‌యూకి వెళ్ళి మ‌రీ విద్యార్ధుల‌ని క‌లిసి బంద్‌కి మ‌ద్దతు ప‌లికారు. ఆగంతుకుల దాడిలో గాయపడిన విద్యార్థుల్ని కలిసిన దీపిక.. జరిగిన ఉదంతానికి సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.

 

దీనిని త‌ప్పుప‌ట్టిన నెటిజ‌న్స్ జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న ఛ‌పాక్ మూవీ బ్యాన్ చేయాలంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వాద‌న‌లు వినిపిస్తున్నారు.  ప్ర‌స్తుతం ట్విట్టర్‌లో ‘బాయ్‌కట్ ఛపాక్’ అనే హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. కొంద‌రు నెటిజ‌న్స్ బుక్ చేసుకున్న టిక్కెట్స్‌ని క్యాన్సిల్ చేసుకొనీ మ‌రి వాటిని ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక  మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో ఛ‌పాక్ మూవీ తెర‌కెక్క‌గా, ఈ మూవీ ల‌క్ష్మీ అగ‌ర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత నేప‌థ్యంలో రూపొందిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: