సంక్రాంతి సినిమా ల సందడి మొదలైపోయింది .. తెల్లారితే రజినీకాంత్ దర్బార్ సినిమా విడుదల కి సిద్ధం అయిపోతోంది. ఈ నేపధ్యం లో దర్బార్ సినిమా వస్తున్నట్టు కూడా చాలామందికి తెలియకపోవడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్ తెలుగు లో చాలా వీక్ గా ఉండడం తో ఇలాంటి పరిస్తితి ఏర్పడింది అని రజిని ఫాన్స్ వాపోతున్నారు. అలాగని డైరెక్టర్ కూడా ఏమీ కొత్తవాడు కాదు. కానీ కబాలి రేంజ్ లో కూడా ప్రమోషన్ లేదు అంటే పరిస్తితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మురుగదాస్ లాంటి నెంబర్ 1 స్థాయి డైరెక్టర్ రజినీకాంత్ తో వస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో సినిమా ని జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి కానీ అలా జరగడం లేదు అంటున్నారు సినిమా ప్రేక్షకులు. దానికి ప్రధాన కారణం ట్రెయిలర్ కూడా కావచ్చు.

 

 

 తమిళనాట దర్బార్ కి పోటీ గా పెద్ద సినిమాలు ఏవీ లేవు కానీ తెలుగు లో అల్లూ అర్జున్ , మహేశ్ బాబు ల సినిమా లు ఉన్నాయి. సొ ఈ పరిస్తితి లో తెలుగు లో ప్రమోషన్ ఇంకా ఎక్కువ ఉండాలి కానీ పరిస్తితి రివర్స్ లో ఉంది. అయితే రేపు విడుద‌ల కానున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే మంచి స్థాయిలో ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

 

 

ప్ర‌మోష‌న్ భీక‌ర స్థాయిలో లేక‌పోయినా.. ఈ సినిమాను తెలుగునాట కొంత‌మంది అయినా గుర్తించే అవ‌కాశం ఉంది. సినిమా ప్రేక్షకుల వరకూ ఈ సినిమా తెలుసు గానీ .. దర్బార్ రిలీజ్ గురించి ఫామిలీస్ కి ఒక్క మాట కూడా తెలీదు " దర్బారా అది ఎవరి సినిమా ? ఎప్పుడు రిలీజ్ ? " అంటున్నారు ఫామిలీ లేడీస్ !!

మరింత సమాచారం తెలుసుకోండి: