టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు వి విజయేంద్రప్రసాద్ కథని, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 

 

ఇకపోతే ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని కీలక విలన్స్ పాత్రల్లో పలువురు హాలీవుడ్ నటులు నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మరొక పాత్రలో కోలీవుడ్ నటుడు సముద్ర ఖని నటిస్తున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మరొక విప్లవ వీరుడు ఉన్నట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు, తన విప్లవ గీతాలతో పలు సంచలనాలకు నెలవైన ప్రజాగాయకుడు గద్దర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్ర కోసం ఒక అద్భుతమైన పాటను రాశారని, 

 

అలానే ఆ పాటను సినిమాలోని ఒక సీన్ లో ఆయనే స్వయంగా ఆ పాట పాడనున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉండడంతో, మధ్యలో ఇటువంటి క్రేజీ రూమర్స్ బయటకు వస్తుంటే సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: