ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత నుండి మెల్లగా తన నటనతో ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగారు. ఆ తరువాత కొన్నాళ్లకు తన కెరీర్ పరంగా ఖైదీ సినిమాతో అతి పెద్ద విజయాన్ని అందుకుని దూసుకెళ్లిన చిరంజీవి, అక్కడి నుండి తన విజయాల పరంపర కొనసాగించి అప్పట్లో టాలీవుడ్ లో అతి పెద్ద స్టార్ గా అవతరించారు. ఇక ఆ తరువాహత కొన్నేళ్లపాటు మెగాస్టార్, టాలీవుడ్ అగ్ర నటుడిగా కొనసాగారు. కాగా ఆయన సినిమాల్లో హీరోగా నటిస్తున్న సమయంలో ఆయన సోదరుడు మెగాబ్రదర్ నాగబాబు కూడా సినీ రంగ ప్రవేశం చేసి, 

 

అక్కడక్కడా కొన్ని సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు. ఇక ఇటీవల ఎక్కువగా బుల్లితెరపై సందడి చేస్తున్నారు నాగబాబు. అయితే ఆ తరువాత 1996లో మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో రంగప్రవేశం చేసారు. ఆ తరువాత నుండి పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగిన పవన్, మెగాఫ్యాన్స్ పాలిటి పవర్ స్టార్ గా పేరు గడించారు. ఆపై మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి వారు వచ్చారు. అయితే ఫ‌స్ట్ మెగా ఫ్యాన్స్ అంతా ఒక్క‌టే అనే విషయం తెలిసిందే. అయితే రాను రాను ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్ మెల్లగా చీలిపోతూ మొదటగా ఇటీవల ప‌వ‌న్ ఫ్యాన్స్ వేర‌య్యారు, 

 

ఇక ఇప్పుడు మళ్ళి అల్లు ఫ్యాన్స్‌ గా అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నారు. ఇలా మెగా ఫ్యామిలీలో వ‌రుస చీలిక‌లు మొదలయ్యాయి. నిజానికి మెగాఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు అందర ఒకప్పుడు కలిసి ఉండేవారని, కాగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి చూస్తుంటే వారి ఫ్యామిలీలో కొద్దిపాటి అంతర్గత కలహాలు మాత్రం జరుగుతున్నట్లు స్పష్టం అవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి మున్ముందు ఈ విధంగా మెగా ఫ్యాన్స్ లో ఈ చీలికలు ఎక్కడివరకు పోతాయో, వీటికి ఎంతవరకు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: