ఈవారం విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఊహించిన విధంగా సంచలనాలు సృష్టిస్తే అనీల్ రావిపూడి టాప్ 3 డైరక్టర్స్ లిస్టులో చేరిపోవడం ఖాయం. ఇప్పటి వరకు రాజమౌళి కొరటాల శివలు మాత్రమే అందుకుంటున్న వరస విజయాల జాబితాలో అనీల్ రావిపూడి చేరిపోయి క్రేజీ డైరెక్టర్ గా మారిపోతాడు. 

ఇప్పటి వరకు అనీల్ రావిపూడి తీసిన ప్రతి సినిమాలోను హాస్యం ప్రధాన పాత్రను పోషించింది. కామెడీ సీన్స్ తో సరిసమానంగా సినిమా కథ నడుస్తూ ఉంటుంది. దీనికితోడు అతడికి అదృష్టం కూడ కలిసి రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అనీల్ రావిపూడి పేరు మాత్రమే వినిపిస్తోంది. 

ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనీల్ రావిపూడి తన అజ్ఞాత గురువు పేరును బయటపెట్టాడు. తనకు దర్శకుడు జంధ్యాల సినిమాలు అంటే బాగా ఇష్టమని ఆ ప్రభావంతోనే తన సినిమా కథలో హాస్యం ప్రధాన పాత్రను పోషిస్తుంది అన్న విషయమై క్లారిటీ ఇస్తూ ఒక విధంగా తాను జంధ్యాలకు ఏకలవ్య శిష్యుడుని అని పేర్కొన్నాడు.

వాస్తవానికి జంధ్యాల సినిమాలతో టాప్ కమెడియన్ స్థాయికి ఎదిగిన బ్రహ్మానందం టాప్ కామెడీ హీరో స్థాయికి ఎదిగిన సీనియర్ నరేష్ రాజేంద్రప్రసాద్ లు ఎప్పుడో జంధ్యాల పేరును మర్చిపోయినా ఇప్పుడు ఈనాటి తరం ప్రేక్షకులు మర్చిపోయిన జంద్యాల పేరును ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ లో గుర్తుకు చేయడం ఒక విధంగా ఆ గొప్ప దర్శకుడుకి నివాళి అనుకోవాలి. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో హీరో విలన్ ను  చంపడం అదేవిధంగా హీరో విలన్ ను మంచివాడుగా మార్చడం లాంటి రొటీన్ సీన్స్ లేకుండా ఈమూవీ క్లైమాక్స్ ఉంటుంది అని చెపుతూ అనీల్ రావిపూడి ఈమూవీ పై మరింత అంచనాలు పెంచుతున్నాడు. ఈమధ్య కాలంలో రొటీన్ క్లైమాక్స్ సీన్స్ కాకుండా వెరైటీని కోరుకుంటున్న ప్రేక్షకులకు ‘సరిలేరు నీకెవ్వరు’ క్లైమాక్స్ కనెక్ట్ అవ్వడం బట్టి ఆమూవీ ఘన విజయం ఆధారపడి ఉంటుంది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: