సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సంక్రాంతికి అన్ని పెద్ద చిత్రాల కన్నా ముందు థియేటర్ల వద్ద సందడి చేయబోతున్న చిత్రం 'దర్బార్'. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న రజనీపై అటు తమిళ ప్రజలు తో పాటూ తెలుగు ప్రజలు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఒక పోలీసుగా రజిని స్క్రీన్ పైన సందడి చేయనుండగా మురుగదాస్ తన వైవిధ్యతను జోడించి రజనీకి మాస్ లుక్ కోసం అతనిని ఒక 'బ్యాడ్ కాప్' గా చూపించనున్నాడు.

 

ఇదిలా ఉండగా ఈరోజు అర్ధరాత్రి నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదల సిద్ధమైన చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన ట్విస్ట్ బయటకు వచ్చేసింది. ట్రైలర్ మరియు టీజర్ లో నేరస్తులకు చండశాసనుడు గా కనిపించిన రజిని సరిగ్గా సినిమా మధ్యభాగంలో అతనే ఒక నేరస్తుడిగా కనిపించబోతున్నాడని అంతా అంటున్నారు. తమిళనాట లో రజిని ఎలా ఉన్నా అక్కడి ప్రేక్షకులు చూస్తారు కానీ ఇక్కడ మాత్రం సరైన సమయంలో ట్విస్టు ని తెలిసేలా చేసి మంచి ఇంపాక్ట్ తీసుకురాగలిగితే రజిని బాక్సాఫీస్ వద్ద రికార్డులు మోగిస్తాడు.

 

ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ కు ముందు ఒక 15 నిమిషాల ఎపిసోడ్స్ థియేటర్ లో అందరి చేత లేచి చప్పట్లు కొట్టించే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మురుగదాస్ కూడా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా విషయాన్ని స్పష్టం చేసాడు. ఎపిసోడ్ లో వచ్చే ఒక ఫైట్ కూడా అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: