సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యక్తిత్వంలో, నటనలో ఆయనకు ఆయనే సాటి. రజనీ సినిమాలు అనగానే ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తాడు. ఒక తమిళ నటుడు ఇంతలా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అంటే బహుశా అది రజనీకాంత్ గారికే సాధ్యం అయ్యిందనుకుంటాను. ఇకపోతే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే తమిళనాట అదో పెద్ద పండగేనని చెప్పాలి. ఒక తమిళనాటే కాదు, దాదాపుగా ఆయనను అభిమానించే ప్రతి వారికి అదొక ఆనందం కలుగుతుంది.

 

 

ఇక ఈ మధ్యకాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న ఆయనకు కెరీర్ పరంగా కాస్త ఊరటనిచ్చిన చిత్రాలు '2.0"  హిట్ కాగా "కాలా" సినిమా నిరాశను మిగిల్చింది. "పేట" యావరేజ్‌గా మిగిలింది. ఇకపోతే ఇటీవల రజనీ హీరోగా నటించిన సినిమా "దర్బార్". ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా రేపు అనగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లో రిలీజ్ అవుతుంది. ఇందులో రజినీ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సౌత్ లో విలన్ గా పరిచయం అవుతున్నాడు.

 

 

కాగా భారీ అంచనాల నడుమ రేపు విడుదల అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఊహించని రేంజ్‌లో సినిమా థియేటర్స్ ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే తెలుగులో కూడా ఈ సినిమాకి పోటీ ఏమీ లేకపోవడంతో భారీగానే రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా థియేటర్స్ వివరాలు చూస్తే ఇండియాలో 5000 థియేటర్స్ లో, మిగిలిన ఓవర్సీస్ పరంగా 2000 థియేటర్స్ లో, అనగా మొత్తం 7000 థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. అంతే కాకుండా కేవలం ఒక్క హైదరాబాద్ లో మాత్రమే మొదటి రోజు 140 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. హైదరాబాద్ కాకుండా, నైజాం లోనే 240 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది,

 

 

ఇకపోతే ఆంధ్ర, సీడెడ్ లో 500 కి పైగా స్క్రీన్ లో రిలీజ్ కానుంది. అనగా ఆంధ్ర, తెలంగాణ కలుపుకుంటే దాదాపుగా 750 నుంచి 800 థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ  చెప్పుకోవాల్సింది ఏంటంటే.. హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్, పివిఆర్, జివికె లాంటి మల్టీ ప్లెక్సుల్లో మొదటి రోజు తెలుగులో మాత్రమే సుమారు 16 నుంచి 18 షోస్ పడుతున్నాయి.

 

 

ఇవి కాకుండా కొన్ని మల్టీ ప్లెక్సుల్లో నాలుగైదు తమిళ్ షోస్ కూడా పడుతుండడం విశేషం. ఈ రకంగా చూసుకుంటే రజినీకాంత్ చిత్రం ప్రొడ్యూసర్లకు నష్టాల్ని మిగల్చకపోవచ్చు. ఒక వేళ మొదటి షోతోనే పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటే ఇక ఈ చిత్రానికి తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: