గతంలో ఎంత పెద్ద సినిమా అయినా ఏ స్టార్ హీరోయిన్ ఉన్నా గాని ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం హీరో ఫొటోనే ఉండేది. అయితే ఈమధ్యకాలంలో కాస్త పద్ధతి మారింది. లేకపోతే టీజర్ లో కూడా కంప్లీట్ గా హీరోనే కనిపించేవాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. పైగా ఈ విషయాన్ని అంతగా ఏ హీరోయిన్ కూడా ఇప్పటి వరకు పాయింటౌట్ చేసింది లేదు. ఎందుకంటే సినిమాకి హీరోనే మేయిన్ పిల్లర్. అయితే ఈ విషయంలో సమంత అభిమానులు కాస్త ఎక్కువ చేస్తున్నారు. ఈ చిన్న లాజిక్ ను కూడా మిస్ అవుతున్నారు సోషల్ మీడియాలో లేనిపోని రచ్చా చేస్తూ అనవసరమైనా కామెంట్స్ చేస్తూ సమంత పరువు తీస్తున్నారు. సంబంధం లేని విషయంలో సమంతను లాగుతున్నారు.

 

శర్వానంద్-సమంత హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమిళ్ లో సూపర్ హిట్టయిన 96 సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు తెలుగులో జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వాస్తవంగా ముందు తెలుగు సినిమాకి కూడా 96 అన్న టైటిల్ నే అనుకున్నారు. కాని దానికంటే జాను కరెక్ట్ అని చితెర బృందం ఇలా డిసైడయింది. అంతేకాదు రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అందులో ఎడారిలో ఒంటెలతో శర్వానంద్ ఉన్న స్టిల్ ఉంది. ఈ విషయంలోన్నే మన సమంత ఫ్యాన్స్ మండిపడి అల్లాడిపోతున్నారు. జాను సినిమా టైటిల్ పోస్టర్ లో సమంతకు ఎందుకు స్థానం కల్పించలేదనేది వీళ్ల పిచ్చి ప్రశ్న. ఈ సినిమాలో సమంత పాత్ర పేరు జాను. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే ఆమె క్యారెక్టర్ పేరునే టైటిల్ గా కూడా పెట్టారు. అలాంటప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా సమంత ఫొటో ఉండాలి కదా అనేది వీళ్ళ డిమాండ్.

 

సమంత క్రేజ్ కూడా శర్వానంద్ కు ఏమాత్రం తీసిపోదంటున్నారు సాం ఫ్యాన్స్. ఓ బేబీ సినిమాతో ఆమె సోలోగా హిట్ కొట్టిందని, ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా చేరిందంటూ లెక్కలు తీస్తున్నారు. అది నిజమే. ఈ విషయం అందరు ఒప్పుకొని తీరాలి. సమంతకు మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉందనేది ముమ్మాటికి వాస్తవం. కానీ  ఫస్ట్ లుక్ లో కూడా ఆమె ఫొటో పెట్టాలని డిమాండ్ చేయడం మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది. అయితే ఇంకా ముందు ముందు చాలా పోస్టర్స్ టీజర్ ట్రైలర్ రానున్నాయి కదా ..అప్పుడే ఈ రకంగా గోల చేసి సమంత పరువు తీయడమేంటి.. అంటూ కొంతమంది రివర్స్ లో సమంత ఫ్యాన్స్ ని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: