తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉంటారు రజినీకాంత్. ఓ కండక్టర్ స్థాయి నుంచి భారతదేశం గర్వించే హీరో స్థాయికి ఎదిగిన రజనీకాంత్ తమిళ ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. ఇక రజినీకాంత్ కి వీరాభిమానులు కూడా చాలామంది ఉంటారు. రజినీకాంత్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఎంతో మంది. అయితే ఎన్నో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు  రజినీకాంత్. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ సాదాసీదా మనుశిలగా నిరాడంబరంగా ఉంటారు. అయితే ఈ మధ్య అభిమానులు తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఎన్నో వినూత్న ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక రజనీ అభిమానులు రజిని పై ఉన్న అభిమానాన్ని చాటు కోవడానికి ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. గతంలో రజనీకాంత్ సినిమా విడుదల సమయంలో ఏకంగా సినిమా థియేటర్ ని పెళ్లి వేదిక గా మార్చుకుని నూతన వధూవరులు  పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమా విడుదల తేదీ కంటే శుభముహూర్తం ఏదీ లేదని భావించిన  రజనీకాంత్ అభిమానులు థియేటర్ లోనే పెళ్లి వేదిక ఏర్పాటు చేసి పెళ్లి చేసుకున్నారు. రజనీకాంత్ పై తమకున్న అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు రజనీకాంత్ అభిమానులు. ఇకపోతే రజనీకాంత్ హీరోగా దర్బార్ సినిమా నేడు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. నేడు  రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్బార్ సినిమాలో  చాలా ఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో రజనీకాంత్  సినిమాలో నటిస్తున్నారు. 

 

 

 ఇకపోతే ఈరోజు రిలీజ్ కానున్న దర్బార్  సినిమా హిట్ కావాలని కోరుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా  రజనీకాంత్ సినిమా హిట్ కావాలని కోరుతూ గత 15 రోజుల నుంచి ఉపవాస దీక్షలు చేపట్టారు. మనోసుర్  సంప్రదాయం ప్రకారం నేలపైన అన్నం తింటున్నారు . ఇలా చేయడం వల్ల  తమ అభిమాన హీరో రజినీకాంత్ ధర్భర్ సినిమా హిట్ అవుతుందని ప్రేక్షకులు నమ్మకం. ఇక దర్బార్ సినిమా పై తమిళనాట అభిమానులే  కాకుండా తెలుగు తెలుగు  అభిమానుల్లో  కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. కాగా ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: