బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్... ఒక స్టంట్ మెన్  చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత తనదైన స్టైల్లో యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరికీ ఫేవరెట్ హీరో గా మారిపోయాడు అక్షయ్ కుమార్. ఇప్పటికీ అక్షయ్ కుమార్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఎంతో మంది బాలీవుడ్ ప్రేక్షకులను  అలరిస్తూనే ఉన్నారు.  తన సినిమాలతో ఎన్నో రికార్డులను సైతం సృష్టిస్తున్నారు అక్షయ్ కుమార్. ఎన్నో సంవత్సరాలుగా బాలీవుడ్ స్టార్ హీరోగా  కొనసాగుతూ ఎన్నో డేంజరస్ స్టెంట్స్  తో బాలీవుడ్ ప్రేక్షకులు అందరి మనసులు  దోచారు అక్షయ్ కుమార్.. అక్షయ్ కుమార్ సినిమాలంటే బాలీవుడ్ ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 

 

 

 అక్షయ్ కుమార్ సినిమా వస్తుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది అని బాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తారు . ఐదు పదుల వయస్సు దాటి పోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉంటూ... ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. యాక్షన్ హీరోగా అక్షయ్ కుమార్ కు మంచి గుర్తింపు ఉంది. ఐదు పదుల వయసులోనూ ఎన్నో రిస్కీ స్టంట్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు అక్షయ్ కుమార్. ఇక కథల ఎంపికలో కూడా అందరు హీరోలా కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా హౌస్ఫుల్ 4 చిత్రంతో మంచి విషయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

 

 

 ఇకపోతే సినిమాల్లోనే కాకుండా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కూడా అక్షయ్ కుమార్ నటిస్తూ ఉంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఓ డిటర్జెంట్ సోప్ యాడ్ లో అక్షయ్ కుమార్మరాఠా యోధుడిగా కనిపించారు. అయితే ఈ యాడ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని. మరాటాలు ఆరోపిస్తున్నారు. అక్షయ్ కుమార్ వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మరాఠాలు. ఈ యాడ్ కు  సంబంధించిన అన్ని వీడియోలు ఫోటోలు గూగుల్ నుండి డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తూ... ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్లో అక్షయ్ కుమార్ పై కేసు పెట్టారు మరాఠాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: