సుధీర్-రష్మీ..బుల్లి తెర మీద లవ్లీ న్యూస్ కి కేరాఫ్ ఎడ్రస్. జబర్దస్త్ షో లో వీరిద్దరూ విడివిడిగా ఎంత పాప్యులరో.. కలివిడిగా కూడా అంతే పాపులర్. జబర్దస్త్ ప్రొగ్రాం యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని, కొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ పుకార్లే అని కొట్టిపాడేసారు వీరిద్దరు. కానీ.. వీరిద్దరూ కల్సి జబర్దస్త్ లో కనిపించినా.. ఢీ షోలో మెరిసినా.. వారి మధ్య నడిచే ట్రాక్ కి వుండే రేటింగ్ సపరేట్.
కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. ఇదిలా ఉంటే చమ్మక్ చంద్ర వీరిద్దరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి అంతా అలా అనుకుంటారు కానీ నిజానికి వాళ్ల మధ్య ఏం లేదంటున్నాడు తోటి కమెడియన్ చమ్మక్ చంద్ర. సుధీర్, రష్మీపై ఎలాంటి యాక్ట్ చేసినా కూడా వెంటనే అది వైరల్ అయిపోతుంది. ఆ జోడీకి ఉన్న ఇమేజ్ అలాంటిది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కానీ ఆ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పాడు చంద్ర.
వాస్తవానికి షూటింగ్ అయిపోయిందంటేసుడిగాలి సుధీర్ లోకం వేరు.. రష్మీ లోకం వేరని.. ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారని చెప్పాడు చమ్మక్ చంద్ర. కేవలం రేటింగ్స్ కోసం బుల్లితెరపై అలా కనిపిస్తారు కానీ సుధీర్‌ను కనీసం ఎప్పుడూ రష్మీ గౌతమ్ అలా చూడలేదని చెబుతున్నాడు. ఇదే విషయంపై గతంలో గెటప్ శ్రీను కూడా క్లారిటీ ఇచ్చాడు. కానీ.. వీళ్లపై వచ్చే పుకార్లు మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. కాగా, ప్రస్తుతం సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ బుల్లితెరపై టాప్ ట్రెండింగ్‌లో నడుస్తున్నారు. వీరిద్దరి కెమిస్టీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.