సక్సెస్ ఫుల్  హీరో మహేష్ బాబు సెక్స్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ట్రైలర్ టీజర్ కి మంచి స్పందన రాగా...  అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఖాతాలో భారీ హిట్  ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఓటమి ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మరో విజయం ఖాయమని తెలుస్తోంది. చిత్రబృందం  ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

 

 

 తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఓ సన్నివేశం గురించి అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.అయితే  చిరంజీవి గారి తో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా  90 రోజుల్లో పూర్తి చేస్తా అంటూ అనవసరంగా బుక్ అయ్యారని  అనిల్ రావిపూడి చమత్కరించారు. ఈ 5 నెలలోనే ఈ సినిమా పూర్తవడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్ని కుదరాలంటు  అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. నటీనటుల కాల్ షీట్స్  తో పాటు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటేనే  సమయానికి సినిమా  పూర్తిచేయగలుగుతాం  అని వివరించారు రావిపూడి. తమ సినిమాకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని వెల్లడించారు.

 

 

 సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి సరిలేరు నీకెవ్వరు సినిమా ఐదు నెలల్లో కంప్లీట్ అయింది అని తెలుసుకుని ఆశ్చర్య పోయారట. దీంతో తన దర్శకుడు కొరటాల శివ పిలిచి తన చిత్రం 90 రోజుల్లోనే పూర్తి చేయాలని సభా ముఖంగా కోరారు. కొరటాల శివ కూడా దీనికి ఓకే చెప్పారు. దీంతో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కొరటాల శివ బుక్కయ్యారు అంటూ చమత్కరించారు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: