రెండు పెద్ద సినిమాల మ‌ధ్య‌లో వ‌స్తోంది... స‌రిలేరు, అల రెండు సినిమాల బిజినెస్ రు.100 కోట్లు.. క‌ళ్యాణ్ డేరింగ్‌తో ఈ సినిమాను పండ‌గ‌కు తీసుకు వ‌స్తున్నారు. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు రావ‌డంతో సినిమాకు హిట్ క‌ళ వ‌చ్చింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంద‌రూ సినిమాకు పుల్ స‌పోర్ట్ చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న క్రేజ్ ఆయ‌న‌కున్న ఫ్యాన్స్ హ‌వా మాములుది కాదుకాబ‌ట్టే అన్న‌య్య క‌ళ్యాణ్‌రామ్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హెల్ప్ అడిగారు. ఇక ఆయ‌న సినిమా ప్రీ రిలీజ్‌కి గెస్ట్‌గా రావ‌డంతో సినిమా పై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. కళ్యాణ్ సినిమాకు హిట్ క‌ళ‌వ‌చ్చేసిందనే చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే...ద‌ర్శ‌కుడు స‌తీష్ వీగ్నేష్ గ‌తంలో తీసిన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం కూడా గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌యింది. చిన్న సినిమాగా మొద‌లై పెద్ద హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం కూడా అదే కోవ‌లో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆకట్టుకుంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. స‌తీష్ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను తీస్తున్నార‌ని దాని వ‌ల్ల సెన్సార్ ఇబ్బంది కూడా ఏ మాత్రం రాకుండా చ‌క్క‌గా క్లీన్ యు స‌ర్టిఫికెట్‌తో వ‌చ్చింది.

 

ఎంత మంచివాడవురా సినిమా రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ చితం ఇందులో కళ్యాణ్ రామ్, మెహరీన్, టి ఎన్ ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్  తదితరులు నటించారు.  ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.  . ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. శతమానం భవతి చిత్రాన్ని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయడంతో అంచనాలు బాగున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: