అభిమానం అనేది మనసులోనుంచి పుట్టుకురావాలి ఎవరి బలవంతం మీద పుట్టదు.. ఒక హీరో ని అభిమానించాము అనుకోండి చచ్చే దాక వాళ్ళని తప్ప వేరే వాళ్లని ఉహించుకోలేము. అభిమానించే హీరో సినిమా రెలీజ్ అయిన, హిట్ అయిన, వాల్ల పుట్టినరోజు అయిన అభిమానులు సందడి మాటల్లో చెప్పాలిసిన పని లేదు. ఆ హడావుడే వేరే..

 

అయితే ఒక హీరో పుట్టినరోజు సందర్భంగా ఏకంగా ఒక భారీ కేక్ ని కట్ చేసారు ఫ్యాన్స్. ఏకంగా 5వేల కేజీల కేక్ కట్ చేసారు.. వివరాలలోకి వెళితే ఈరోజు కెజిఫ్ హీరో మరియు కన్నడ రాక్ స్టార్ "యశ్" పుట్టినరోజు. పుట్టినరోజును పురస్కరించుకుని బెంగళూరులో ఆయన అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు వారు 5000 కేజీల భారీ కేక్‌ను తయారు చేయించి కట్‌ చేశారు.

 

అంతేకాకుండా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరిగే ప్రాంతంలో 216 అడుగుల కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు. కేక్‌, కటౌట్‌ రెండు కూడా ప్రపంచ రికార్డులేనని అభిమానులు చెబుతున్నారు... యశ్ అంటే అభిమానించని వారు ఎవరు ఉండరు.. కెజిఫ్ సినిమాలో ఇరగదీసారు.. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నాన్న కి ప్రేమతో కేక్ కూడా చేసిందట యశ్ కూతురు "ఐరా"

 


దీనికి సంబంధించిన వీడియోను ఆయన సతీమణి రాధిక.. యశ్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘హాయ్‌ స్వీట్స్‌.. హ్యాపీ బర్త్‌డే. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజున కేక్‌ తయారుచేస్తున్నాను. కానీ ఈ ఏడాది నాతోపాటు మరో వ్యక్తి కూడా కేక్‌ తయారు చేయడంలో పాల్గొంది. నీదాకా ఈ కేక్‌ వస్తుందని నేను అనుకోవడం లేదు.’ అని రాధిక  సరదాగా అన్నారు.

 

ప్రస్తుతం యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌2’. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్‌’ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ... ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: