పాపం సునీల్ పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. కమెడియన్ గా మాంచి ఫాం లో ఉండగానే అనవసరంగా హీరో అయ్యాడు. కొన్నాళ్ళు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత సునీల్ సినిమాలు వరుసగా ఫ్లాపవడం మొదలు పెట్టాయి. దాంతో నిర్మాతలు నెమ్మదిగా సునీల్ తో సినిమాలు తీయడం మానేశారు. అందుకే మళ్ళీ మొదటికే వచ్చాడు. కమెడియన్ గా క్యారెక్టర్స్ ఒప్పుకొని అలా అలా నడిపిస్తున్నాడు. అది ఏమంత సజావుగా సాగడం లేదు. అందుకే ఈ సారి విలనిజాన్ని చూపించబోతున్నాడట. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమృత ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న నెక్స్ట్ సినిమా ‘కలర్ ఫోటో’ ప్రారంభమైంది. ఈ సినిమాతో కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 

 

అలాగే సునీల్ విలన్‌గా మారుతున్నారు. తెలుగుమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఛాయ్ బిస్కెట్ ఛానెల్‌తో పాపులర్ అయిన సుహాస్ ఆ తరవాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఈ మధ్య కాలంలో మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే వంటి సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మేయిన్ గా ఇతని వాయిస్ బాగా ప్లస్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. మరి హీరోగా సక్సస్ అవుతాడో లేదో చూడాలి.

 

టైటిల్ పోస్టర్‌తోనే బజ్ క్రియేట్ చేసిన కలర్ ఫొటో సినిమాను పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభించారు. కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్ర దర్శకుడు స్వరూప్ క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్‌ను సునీల్ అందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, గోపి మోహన్, పవన్ సాదినేని, నిర్మాత రాహుల్ యాదవ్ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న యం.యం.కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది. శ్రవణ్ కొంక సమర్పణలో అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టై‌న్మెంట్స్ బ్యానర్లపై సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎటు తిరిగి సెంటర్ పాయింట్ సునీల్ అవుతున్నాడు. ఈ సినిమాతో సునీల్ విలన్ గా మారుతున్నాడంటే పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: