118 వంటి ఎక్స్‌పరిమెంటల్ మూవి తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా  'ఎంత మంచి వాడవురా'. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందు వస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అంతేకాదు ఈ వేడుకలో సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ ఆవిష్కరించారు. సినిమాని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో దర్శకుడు సతీశ్ వేగేష్న పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ డ్రామాని నడిపించగలిగే సమర్ధుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఎంత మంచివాడవురా.. లో కళ్యాణ్ రామ్ ని అంతే మంచివాడిగా చూపించబోతున్నాడు.

 

ఇక ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని మొదటి నుంచి చిత్ర యూనిట్ చెబుతూనే ఉంది. ట్రైలర్ లో ఫ్యామిలీ బంధాలు అనుబంధాలను ఎలివేట్ చేస్తూ.... ఈ సంక్రాంతికి సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఫ్యామిలీ ఎమోషన్..యాక్షన్ ని దట్టించి ఈ సినిమాని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఒక్కో చోట ఒక్కొక్క బంధం.. అది విడదీయ రాని బంధం.. అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్రను అంతే ఆసక్తికరంగా మలిచారు.

 

ప్రేమించాలని కళ్యాణ్ రామ్ మెహరీన్ వెంట పడటం... ఎదురించే వాడు రానంత వరకే రా భయపెట్టేవాడి రాజ్యం వంటి భారీ డైలాగులు తో పాటు.. పేరుతో పిలిచే దానికంటే బంధుత్వం పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ లాంటి సెంటిమెంట్ డైలాగులతో సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తిని క్రియోట్ చేశారు. కళ్యాణ్ రామ్ డీసెంట్ కుర్రాడిగా మేకోవర్ తో బాగా ప్లాన్ చేశారు. మెహరీన్ స్రీన్ పై బబ్లీగా కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే ఇప్పటికే చూసేసిన ఎన్నో సినిమాలు గుర్తొచ్చేలా .. కాస్త రొటీనిటీ అనేది కనిపిస్తోంది. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  ఈ చిత్రాన్ని జనవరి 15న ప్రేక్షకుల ముందుకు  తీసుకొస్తున్నారు. దీనికి ముందు మరో ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో మంచి వాడు పోటీ పడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: