ఢిల్లీ జెఎన్ యూ లో జరిగిన ఘటనపై విద్యార్థులను బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఇటీవల పరామర్శించిన సంగతి తెలిసిందే. దాడిని ఖండిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించి విద్యార్ధుల తో భేటీ అయింది. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంపస్ లో కాస్త హడావిడి చేసింది. అయితే దీపిక పై నెటిజనులు మండి పడుతున్నారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దేశ ద్రోహులపై ప్రేమ కురిపిస్తుందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కన్నయ కుమార్.. అయిషీ ఘోష్ వంటి వారికి దీపక మద్దతు తెలిపింది. ఈ నేపథ్యం దాడిలో గాయపడిన ఎబీవీపీ వాళ్ల సంగతేమిటి? నకిలీ ఫెమినిజంతో ఎన్నాళ్లు నెట్టుకొస్తావ్? రణవీర్ ని పెళ్లాడి ఓ ఇంటిదానవయ్యావు. బాలీవుడ్ లో స్టార్ గా ఒక వెలుగు వెలిగిపోతున్నావు. ఇలాంటి పనికిమాలిన ప్రచారం నీకు అవసరమా? అంటూ ఇంతెత్తున ఎగురుతున్నారు.

 

అంతేకాదు కేవలం ఛపాక్ సినిమాను నువ్వు సొంతంగా నిర్మించావు కాబట్టి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నావు. ఇలాంటి చిల్లర ప్రచారంతో ఎలా సక్సస్ అవుతావు అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధ పడుతున్నారు. వాటిలో నిరు పేదల ఆకలి సమస్య భారతదేశంలో ఎంతో ముఖ్యమైనది. పౌష్టికాహర సమస్యతో ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. దేశం అంతటా రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నవారు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళని ఆదుకోవడానికి ఇలాంటి సమస్యలను తీర్చడానికి నీ విలువైన సమయాన్ని కేటాయించమని నెటిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లే కాదు ఈ విషయంలో దీపిక అభిమానులు కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

 

దీపిక కోసం కాక పోయిన నిజమైన హీరోయిన్ లక్ష్మీ అగర్వాల్ కోసమైనా సినిమా చూడాలని కొందరంటే...మరికొందరు మాత్రం నిర్మొహమాటంగా ఛపాక్ ని బాయ్ కాట్ చేయాలని హ్యాష్ ట్యాగ్ ని ట్విటర్ ల్లో ట్రెండ్ చేస్తున్నారు. ఛపాక్ రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు సమయమే ఉన్న నేపథ్యంలో ఈ నెగిటివిటీ సినిమాపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని బాలీవుడ్ మీడియా కూడా సందేహం వ్యక్తం చేస్తోంది. పాపం దీపిక ఎదో అనుకొని అనవసరంగా బుక్కైపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: