ఆమె అచ్చ తెలుగు అందం.. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు తెలుగు తెరపై అవకాశాలు తక్కువ. అలాంటిది ఈ అమ్మడు తెలుగమ్మాయి అయిఉండి తమిళంలో ఎక్కువగా ఛాన్సులు కొట్టేసింది. ఆమె నవ్వు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు.. ఆ రూపం శతకోటి వర్ణాల అందాల నెలవు.. భాషా భేదం లేని అభిమానానికి ఆ నటి ఒక చిరునామా.

ఆమె నటి అంజలి. తమిళంలో వచ్చినంత పేరు తెలుగులో రాలేదు. సీతమ్మవాకిట్లో.. వంటి ఒకటీ అరా సినిమాలు తప్ప పెద్దగా ఆమెను తెలుగు తెర ఆదరించలేదు.

 

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్‌లో పుట్టింది అంజలి. ఆ తర్వాత రాజోల్‌లో పెరిగింది. ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయింది. ఇక్కడ నా పాఠశాల చదువు పూర్తయిన తర్వాత అంజలి పిన్ని వాళ్లింట్లో చదువుకునేందుకు చెన్నై వెళ్లిపోయింది. అక్కడే మోడలింగ్‌ స్టార్ట్‌ చేసింది. అలా అంజలికి తొలి సినిమా అవకాశం వచ్చింది. మొదటి సినిమాయే ఆమెకు మంచి పేరు వచ్చింది.

 

అంజలి అసలు పేరు బాల త్రిపుర సుందరి. ఈ పేరుతో ఆమెను అస్సలు ఎవరూ పిలవరు. అది వాళ్ల నాన్నమ్మగారి పేరు. దానికి అంజలి చేర్చి పేరు పెట్టారు. అయితే, నాన్నమ్మని పేరు పెట్టి పిలిచే ధైర్యం లేకపోవడంతో ఇంట్లో అంతా ముద్దుగా బేబీ అని పిలిచేవారు. ఇప్పటికీ ఇంట్లో అందరూ నన్ను అదే పేరుతో పిలుస్తున్నారు కూడా.

 

తమిళ ఇండస్ట్రీలో నటిస్తుండగా హీరోలు, దర్శకులు చాలామంది ప్రపోజ్ చేశారట. అయితే ఆ వివరాలు ఇప్పుడు చెప్పనంటోంది అంజలి. ఎందుకంటే.. తనకు ప్రపోజ్ చేసిన హీరోలందరికీ ఇప్పుడు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు వాళ్ల పేరు చెబితే వాళ్లింట్లో భూకంపం వస్తుంది కదా అంటూ నవ్వులు విరజిమ్మింది అంజలి. అన్నట్టు అంజలి కాలేజ్ చదివేటప్పుడు ఒక అబ్బాయి ప్రపోజ్‌ చేస్తే వెంటనే రాఖీ కట్టేసిందట. అదేంటి అంటే.. ఊరికే నా వెనకాల తిరుగుతున్నాడని, రాఖీ కట్టి వదిలేశానంటూ నవ్వేసింది అంజలి.

మరింత సమాచారం తెలుసుకోండి: