టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య తన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీగా నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. 

 

అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి హీరోలిద్దరి లుక్స్ కానీ, టైటిల్ కానీ ప్రకటించలేదు. అయితే ఇటీవల జనవరి 1న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం కేవలం న్యూ ఇయర్ విషెస్ మాత్రమే చెప్పి ఎటువంటి పోస్టర్ రిలీజ్ చేయకపోవడంతో సినిమా లవర్స్ ఈ సినిమా యూనిట్ పై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ప్రస్తుతం ఇదే విధంగా రాక్ స్టార్ యాష్ నటిస్తున్న తాజా సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2 దర్శక నిర్మాతలు కూడా ఇదే రీతిన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. నిజానికి నిన్న హీరో యాష్ పుట్టినరోజు కావడంతో, కెజిఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేస్తాం అని కొద్దిరోజుల క్రితం సినిమా యూనిట్ ప్రకటించింది. 

 

అయితే అటువంటిది ఏమి లేదు, కొన్ని అనివార్య కారణాల వలన టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నాం అని కేవలం యాష్ న్యూ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసారు. అయితే అది దారుణం అని, మేము ఎంతగానో టీజర్ కోసం ఎదురుచూస్తే, కెజిఎఫ్ టీమ్ ఈ విధంగా చీట్ చేయడం సరైనది కాదని పలువురు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: