సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాని తెరకెక్కించాడు అనీల్ రావి పూడి. అయితే ప్రేక్షకులు ఒక కథ ని అంత సులభంగా ఒప్పుకోరు అంటున్నాడు. అయినా మహేష్ బాబు అభిమానుల్ని మెప్పించే అంశాలు ఈ సరిలేరులో చాలా ఉంటాయట. అయితే వాళ్ల కోసమే కాకుండా ఒక బలమైన కారణం కోసం ఈ సినిమా చేశాడట. ఇక ఈ సినిమాలో మహేష్ నాన్న గారు సూపర్ స్టార్ కృష్ణగారు తెరపై కనిపిస్తారు. ఆయన కనిపించే విధానం ఆశ్చర్యానికి గురిచేస్తుందట. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు రావిపూడి. గతేడాది ‘ఎఫ్‌2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసారి సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా 11న విడుదలవుతున్న సందర్భంగా అనిల్‌ రావిపూడి తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 

 

‘‘నా సినిమాల్లో మేనరిజమ్స్‌కి కారణం ప్రేక్షకులే. ‘ఎఫ్‌2’ తర్వాత ఎక్కడికెళ్లినా ‘అంతేగా అంతేగా’ అని పలకరించేవాళ్లే. ఈ సినిమాలో కూడా అలాంటిది ఉంటుందా అని చాలామంది అడిగారు. అందుకే ‘నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’ అనీ, ‘మీకు అర్థమవుతోందా?’ అని కొన్ని మేనరిజమ్స్‌ని పెట్టాం. అవి కూడా కచ్చితంగా ప్రేక్షకుల్లోకి వెళతాయి. ఆ విషయంలో నాకు జంధ్యాల సినిమాలే స్ఫూర్తి. తెలుగు సినిమా కామెడీలో పాత్రలకి మేనరిజమ్స్‌ని సృష్టించిందే ఆయన. చిన్నప్పట్నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగా. జంధ్యాలకి ఏకలవ్య శిష్యుడిని నేను అన్నాడు.

 

ఇక గతేడాది ఎంత నవ్వుకున్నారో, అంతకంటే ఎక్కువ నవ్వుకుంటారు. దాంతోపాటు దేశభక్తి, భావోద్వేగాలు, విలువలు... ఇలా చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. సంక్రాంతికి మన ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో అంత చక్కగా ఈ సినిమా ఉంటుంది . ‘సుప్రీమ్‌’ తీస్తున్న సమయంలో జోధ్‌పూర్‌ నుంచి రైల్లో వచ్చేటప్పుడు ఒక సైనికుడిని కలిశాడట. ఒక రోజంతా ఆయనతో కలిసి ప్రయాణం చేశాడట. అతన్ని చూసినప్పుడు అనిల్ కి చాలా వింతగా అనిపించిందట. చాలా సరదాగా, నవ్వుతూ నవ్విస్తూ గడిపాడట. ఆయన స్ఫూర్తితో రాసుకున్న కథే సరిలేరు అని ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్ ఏంటో రివీల్ చేశాడు. కర్నూలు లాంటి ఒక ప్రదేశం ఈ సినిమాకి నేపథ్యంగా ఉంటేనే బాగుంటుంది. అలాగని ఇందులో ఫ్యాక్షనిజం ఉండదు. 

 

మహేష్‌బాబు, ప్రకాష్‌రాజ్‌, విజయశాంతి... ఈ ముగ్గురు పాత్రల మధ్య సాగే కథ ఇది. సైనికుడు, సైన్యంఅనగానే ప్రతి ఒక్కరికీ చేరువవుతుంది.అందులోనే హీరోయిజం కనిపిస్తుంది. సైన్యం గురించి ఇందులో చెప్పే ప్రతి మాట మనసుల్లోకి వెళుతుంది. ఈ కథలో నాకూ, మహేష్‌కీ బాగా నచ్చిన విషయం అదే...అన్నాడు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ సరిలేరు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి..అలాగే జంధ్యాలకి ఏకలవ్య శిష్యుడిని అన్నప్పటి నుంచి నెటిజన్స్ అనీల్ ని ఆడేసుకుంటున్నారు. అసలు మహేష్ ని ఏం చేయబోతున్నావ్ అంటూ కొందరు ..జంధ్యాల పేరు ఎత్తినందుకు కొందరు ట్రోల్ చేస్తున్నారు. 

 

ఇక ‘ఎఫ్‌2’ చేస్తున్న సమయంలోనే మహెష్ బాబు కి కథ చెప్పాడట. 40 నిమిషాలు కథ చెప్పాక... ‘బాగుంది, ఇందులో మేజిక్‌ ఉంది’ అన్నారట మహేష్. ఫిబ్రవరిలో ఈ సినిమా చేస్తామని చెప్పారు. చిత్రీకరణకి వెళతామనగా పూర్తిస్థాయి కథ విన్నారు. దేశ సరిహద్దుల నుంచి ఒక సైనికుడు, జనం మధ్యకి వస్తే ఎలా ఉంటుంది? శత్రువుతో ఎప్పుడూ పోరాటం చేస్తూ మనల్ని కాపు కాసే ఓ సైనికుడు మన తప్పులపై ఎలా స్పందిస్తాడు? మనమంతా బాధ్యతగా ఉండాలి కదా అని ఎలా చెబుతాడు? అనేదే ఈ సినిమా...అన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే దర్శకుడే కథ ని రివీల్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: