రజినీకాంత్ దర్బార్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియం షోలు ముగిశాయి.  సినిమా ఎలా ఉన్నది అనే దానికి సమాధానం వస్తున్నది.  బొమ్మ సూపర్ హిట్ అని అంటున్నారు.  సినిమాలో రజినీకాంత్ నటన సూపర్ అని సంబరపడిపోతున్నారు యూత్.  ఫ్యాన్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.  చాలా కాలంగా రజినీకాంత్ ను ఎలా చూడాలి అని ఫ్యాన్స్ అనుకున్నారో అలా చూపించారని, 70 ఏళ్ల వయసులో కూడా రజిని అదిరిపోయారని అంటున్నారు.

 
ఫస్ట్ హాఫ్ సరదాగా, ఫన్నీగా, రొమాంటిక్ గా సాగిందని, ఇక ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకు ప్లస్ అని అన్నారు.  ఇంటర్వెల్ బ్యాంగ్ సునీల్ శెట్టి రాకతో అదిరిపోయినట్టు చెప్తున్నారు.  సెకండ్ హాఫ్ లో పోలీసులకు ఛాలెంజింగ్, యాక్షన్, సెంటిమెంట్ తో సూపర్ అని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.  సినిమాకు స్క్రీన్ ప్లే పరుగులు తీయించిందని, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సంక్రాంతి సినిమాను ఇచ్చారని అంటున్నారు అభిమానులు.

 
బొమ్మకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్లకు వద్ద సందడి, తాకిడి పెరిగిపోయింది.  రజిని సినిమా నిజమైన హిట్ పడితే ఎలా ఉంటుందో అలా ఉందని అంటున్నారు.  చాలా కాలం తరువాత రజిని  అభిమానులకు ఫుల్ మీల్స్ దొరికింది.  ఇక చూస్తూ ఊరుకుంటారా చెప్పండి.  సూపర్ హిట్ అని పండగ  చేసుకోరా  మరి.  నివేత థామస్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తామని,  కేసును పోలీసులు సాల్వ్  చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించిన విధానం సూపర్ అని అంటున్నారు.  


ఇకపోతే, రజినీకాంత్ నటన, యాక్షన్,  సినిమాకు హైలైట్ గా నిలిచిందని ట్వీట్ చేస్తున్నారు.  దీంతోపాటుగా మురుగదాస్ టేకింగ్ సినిమాకు మరో ప్లస్ అయ్యింది.  సంతోష్ శివన్ కెమెరా పనితనం సినిమాకు ఆయువు పట్టుగా నిలిస్తే, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు.  సూపర్ హిట్టు బొమ్మ హిట్టు అని అభిమానులు సంక్రాంతిని ముందుగానే చేసుకుంటున్నారు.  మరి తెలుగు ప్రేక్షకులకు సినిమా ఎలా నచ్చుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: