రజినీకాంత్ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు ముగిశాయి.  సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.  సినిమాను మురుగదాస్ తుపాకీ స్టైల్లో రేసి స్క్రీన్ ప్లేతో అదరగొట్టారని అంటున్నారు.  రజిని తన మార్క్ ను చూపించారని, రజిని స్టైల్లో సినిమా దాటిపోయిందని అంటున్నారు.  చాలా కాలం తరువాత రజిని మార్క్ సినిమా కనిపించిందని చెప్తున్నారు.  ఇలాంటి సినిమాలు తరుచుగా వస్తుంటాయి రావా అన్నది పక్కన పెడితే, సినిమాల్లో చాలా సీన్స్ హైలైట్స్ గా ఉన్నాయి.  


అందులో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ అని అంటున్నారు.  సెకండ్ హాఫ్ సీన్స్ సినిమాను ఇక్కడితో తీసుకెళ్లిందని చెప్తున్నారు.  సెంటిమెంట్ పరంగా కూడా సినిమాకు వర్కౌట్ అయ్యినట్టు సమాచారం.  ఇక రజిని, నయన్ ల మధ్యన వచ్చే సీన్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.  ఈ సీన్స్ తో సినిమా లేచింది.  అంతేకాదు, సినిమా పరంగా కూడా మంచి విజయం సాధించింది.  


రజిని సినిమా హిట్ టాక్ అందుకోవడంతో కలెక్షన్లు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఇప్పుడు ఇదే భయం మిగతా రెండు సినిమాలకు పట్టుకుంది.  సరిలేరు నీకెవ్వరూ సినిమా జనవరి 11 న రిలీజ్ కాబోతున్నది.  రజిని ఎఫెక్ట్ ముందుగా పడేది ఈ సినిమా మీదనే మహేష్ బాబు సినిమా కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్లు సూపర్ గా ఉంటాయి.  సినిమా బాగుంటే కలెక్షన్లు బాగుంటాయి.  తేడా కొట్టిందా మళ్ళీ రజిని థియేటర్లోకి వస్తారు.  


అలానే జనవరి 12 న రాబోతున్న అల వైకుంఠపురంలో కూడా కొంత టెన్షన్ పడుతూనే ఉన్నది.  రజిని సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెద్ద పెద్ద స్టార్స్ తట్టుకోలేరు.  యంగ్ స్టార్స్ సినిమాలు ఎంత అని భయపడుతున్నారు. అలవైకుంఠపురంలో సినిమాకు వచ్చే టాక్ ను బట్టి ఆసినిమా కలెక్షన్లు ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు.  మరి చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: