సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం దర్బార్. సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. అది కూడా చాలా ఏళ్ళ తర్వాత ఈయన ఖాకీ డ్రస్ వేసుకున్నాడు. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. 70 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఎనర్జిటిక్ రోల్ చేసాడు సూపర్ స్టార్. తెలుగులోనూ ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు చిత్రయూనిట్‌.

 

సినిమా విష‌యంలోకి వెళ్తే.. సీక్రెట్ గా ఆదిత్య అరుణాచలం ఒక గ్యాంగ్ స్టర్ సెటప్ చెయ్యడంతో టైటిల్స్ ప‌డ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది.  అలాగే కత్తితో అసలు సిసలైన తలైవర్ రజినీ మార్క్ మాస్ ఎంట్రీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇక‌ పోలీస్ గెటప్ లో రజినీ స్టైలిష్ కాప్ గా అద‌ర‌గొట్టాడ‌నే చెప్పాలి. అలాగే ఆదిత్య అరుణాచలం ముంబై నుంచి ఢిల్లీకి ట్రాన్సఫర్ కావడంతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ న‌డుస్తుంది. క‌థ విష‌యంలోకి వెళ్తే.. ఓ డిప్యూటీ సీఎం కూతురు కిడ్నాప్ అవ్వగా ఆ కేసును రజినీ విచారిస్తుంటారు. మురుగదాస్ మార్క్ లో ఈ సీన్ ఆసక్తికరంగా సాగుతుంది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ (అజయ్ మల్హోత్రా) అమ్మాయిల‌ను అక్రమంగా తరలించే మాఫియా హెడ్ గా క‌నిపిస్తాడు.

 

ఇక ఆదిత్య ఆరుణాచ‌లంగా ర‌జ‌నీ యాక్టింగ్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. అలాగే సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఓ రేంజ్‌లో న‌డించింది. ఒక్క సెకన్ కూడా బోర్ అనేది కొట్టకుండా రేసీ స్క్రీన్ ప్లేతో అలరించాడు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. మ‌రియు రజినీకాంత్ ఎంట్రీ, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. కాగా,  చంద్రముఖి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌ర్వాత మళ్లీ రజినీకాంత్, నయనతార జంటగా న‌టించిన చిత్రమిది. ఈ సినిమాలో నయనతార గతంలో కన్నా అందంగా క‌నిపిస్తుంది. ఏదేమైనా ర‌జ‌నీ మ‌రో హిట్ ఖాతాలో వేసుకున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: