సంక్రాంతి పండగ అంటేనే కొత్త అల్లుళ్ళు, ముగ్గులు, వంట‌లు ఇవ‌న్నీ ఒక ఎత్తైతే ఈ పండ‌గ‌కి విడుద‌లయ్యే సినిమాలు మ‌రో ఎత్తు. ఈ సారి బ‌రిలో మ‌హేష్‌బాబు, బ‌న్నీ, క‌ళ్యాణ్‌రామ్‌ల‌తో పాటు త‌లైవా ర‌జ‌నీకాంత్ కూడా బ‌రిలో దిగారు. ఇక అంద‌రికంటే ముందు ర‌జ‌నీ సినిమానే విడుద‌ల‌వుతుంది. ఈ రోజు `ద‌ర్బార్` చిత్రం ఒక్క‌టే విడుద‌ల‌వుతుంది. సోలోగా వ‌స్తూ సూప‌ర్ హిట్ కొట్టాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

 

రజిని ఆదిత్య అరుణాచలంగా  ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  నటిస్తున్నారు.  సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కించారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. 
ఈ చిత్రంలోని ఎ.ఆర్.మురుగదాస్ యొక్క రేసీ స్క్రీన్ ప్లే సూప‌ర్ అదుర్స్ అనే చెప్పాలి. అలాగే రజినీ వన్ మ్యాన్ షో. ర‌జ‌నీ సినిమాలో ఎంత మంది యాక్ట‌ర్స్ ఉన్నా చాలా మంది ఆయ‌న స్టైల్‌ను చూడ‌టం కోస‌మైన సినిమాకి వెళుతుంటారు. 

 

రజినీ స్టైల్ ను మురుగదాస్ పట్టుకొని మంచి మాస్ ఎలివేషన్ సీన్స్ తో ఆకట్టుకుంటారు. అలాగే యోగిబాబుతో చేసిన హాస్య స‌న్నివేశాల్ని కానీ పలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి.  అయితే ఈ ఇద్దరి కాంబో అంటే ఏదొక స్పెషల్ ఉండాలి కానీ అది మిస్సయ్యింది. కథ అంతగా లేదు, కానీ గట్టిగా నిండిన కథాంశం అదిరింది. రజినీ యొక్క హిస్ట్రియోనిక్స్ అభిమానులకు పిచ్చిగా న‌చ్చుతుంది. కాప్ ఎలిమెంట్స్ ఇన్వెస్టిగేష‌న్ స‌న్నివేశాలు అన్నీ బాగానే ఉన్నాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అద‌ర‌గొట్టేశాడ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: