సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన సినిమా దర్బార్. ఈ సినిమా ప్రీమియర్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తుంటే రజినికాంత్ కు అసలు సిసలైన హిట్టు ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. అంతేకాదు డైరక్టర్ మురుగదాస్ కూడా ఈ సినిమాతో ఫాం లోకి వచ్చినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా తన మార్క్ సినిమాలను అందించని మురుగదాస్ దర్బార్ తో తన సత్తా చాటాడని అంటున్నారు. విజయ్ సర్కార్ సినిమా కూడా మురుగదాస్ కు మంచి పేరు తెచ్చినా సూపర్ హిట్ అనిపించుకోవడంలో వెనుకపడ్డది.

 

అయితే తెలుగులో మురుగదాస్ సినిమాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమా తీసిన మురుగదాస్.. మహేష్ తో స్పైడర్ సినిమా చేశాడు. స్పైడర్ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే సర్కార్ సినిమా విషయంలో కూడా జరిగిన తప్పులను తెలుసుకున్న మురుగదాస్ దర్బార్ సినిమాలో అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది. సినిమాలో రజిని స్టైల్.. మురుగదాస్ రేసీ స్క్రీన్ ప్లే సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయని తెలుస్తుంది.

 

మురుగదాస్ సినిమాలకు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సూర్యతో తీసిన గజిని సినిమాను హిందిలో ఆమీర్ ఖాన్ తో కూడా చేశాడు. అయితే ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు ప్రయత్నించినా వర్క్ అవుట్ అవలేదు. అందుకే మళ్లీ కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు ఈ దర్శకుడు. మురుగదాస్ తో రజిని సినిమా కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. దర్బార్ సినిమాతో కేవలం మురుగదాస్ మాత్రమే కాదు కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని రజినికాంత్ కు కూడా సూపర్ హిట్ పడేలా ఉందని అంటున్నారు. దర్బార్ కథ రొటీన్ గానే ఉన్నా మురుగదాస్ నడిపించిన స్క్రీన్ ప్లే బాగుందని ప్రీమియర్స్ నుండి వచ్చిన టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: