సంక్రాంతి సినిమా రేసులో చివరిగా రాబోతున్న ‘ఎంత మచి వాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. నందమూరి అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ ఈవంట్ కు అతిధిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చాల క్లప్తంగా మాట్లాడాడు. ఎటువంటి వివాదాస్పద కామెంట్స్ అదేవిధంగా వివాదాస్పద సంఘటనలకు చోటు ఇవ్వకుండా నిన్నటి ఈవెంట్ ముగిసింది. 

ఈ మధ్య కాలంలో బయటకు వస్తే చాలు హ్యాట్ పెట్టుకోకుండా వస్తున్న జూనియర్ అదే తీరును కొనసాగిస్తూ నిన్న రావడమే కాకుండా తన అన్న కళ్యాణ్ రామ్ మూవీకి ఘన విజయాన్ని ఇవ్వవలసిందిగా తన అభిమానులకు పిలుపు ఇచ్చాడు. సంక్రాంతి రేసుకు వస్తున్న అందరి హీరోల సినిమాలను చూడవలసిందిగా తన పిలుపు ఇచ్చి తాను అందరివాడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసాడు. 

జూనియర్ ను చూడగానే అతడిని చుట్టు ముట్టిన అతడి నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ కు సంబంధించిన లీకులను రాబట్టడానికి మీడియా తనవంతు ప్రయత్నాలు చేసింది. అయితే జూనియర్ మాత్రం తనకు ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ కు సంబంధించిన విషయాలు తనకు ఏమాత్రం తెలియవు అనీ ఈ విషయంలో రాజమౌళి మాత్రమే స్పందించగలడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

అయితే ఈమధ్య ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకున్న సమయానికి ఎటువంటి వాయిదా పడకుండా రిలీజ్ అవుతుంది అంటూ చెపితే ఇప్పుడు జూనియర్ మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ టైమ్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాడు అంటూ మీడియా వర్గాలు చాలామంది షాక్ అయినట్లు టాక్. ఇది ఇలా ఉంటె నిన్న జరిగిన కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ మూవీ ఫంక్షన్ లో జూనియర్ కొంచం ముభావంగా కనిపిస్తూ ఎటువంటి జోష్ లేకుండా కనిపించడం కూడ చాల మందికి ఆశ్చర్యం కల్గించింది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: