సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక. రజనీకాంత్ తమిళ్ హీరో అయినప్పటికీ వివిధ భాషల్లో రజనీకాంత్ కు  ఒకరోజు ఒక రేంజ్ లో క్రేజ్  ఉంటుంది. అయితే గత కొంతకాలంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రజినీకాంత్... విభిన్నమైన కథతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ రజినీకాంత్ స్థాయికి తగ్గ హిట్ మాత్రం పడలేదు. ఇకపోతే తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా దర్బార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కథ అంత బాగుందా అంటారా... అబ్బే అదేం లేదండి రొటీన్ కథ... కానీ దర్శకుడు మురుగదాస్ తీసే విధానంలో చాలా కొత్తదనం ఉంది. ఏ సినిమాకైనా దర్శకుడు టేకింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో కూడా అది మరోసారి ప్రో  అయిపోయింది. రొటీన్ కథే అయినప్పటికీ అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ దానిని మురుగదాస్ తెరకెక్కించిన తీరు కు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోతున్నారు. 

 

 

 

 దీంతో దర్బార్ సినిమా తో రజనీ కాంత్ మరోసారి తన స్థాయి హిట్ కొట్టబోతున్నాడు  అని అభిమానులు భావిస్తున్నారు. ఇక దర్శకుడు మురుగదాస్ అంటే కథ  ఎలా ఉన్నప్పటికీ తనదైన స్క్రీన్ ప్లే  మాయాజాలంతో ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా తనదైన మార్కును చాటి ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేశాడు మురుగదాస్. ఇక రజనీకాంత్ ఎన్నో ఏళ్ళ తర్వాత మొదటి సారి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం కూడా ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే యాక్షన్ ఎలిమెంట్స్ తప్పక ఉంటాయన్న విషయం తెలిసిందే. దర్బార్  సినిమాలో  పోలీస్ పాత్రలో యాక్షన్ ఎలిమెంట్స్ లో ఇరగదీశాడు రజనీకాంత్. తనదైన స్టైల్ లో అందరిని ఆకట్టుకున్నాడు. 

 

 

 అయితే ఈ సినిమా కథ విషయంలో దర్శకుడు మురుగదాస్ రొటీన్ కథ రాసుకున్నప్పటికీ తనదైన స్టైల్ స్క్రీన్ ప్లే  మాయాజాలం రజిని స్టైల్ యాక్షన్ సీన్లు ఎలివేషన్ చేసి... రజనీ స్థాయిలో ప్రేక్షకులందరినీ మెప్పించాడు మురుగదాస్. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సునీల్ శెట్టి... హీరోగా పోలీస్ పాత్రలో నటించిన రజినీకాంత్ మధ్య ఎత్తులు పై ఎత్తులతో సినిమాను దర్శకుడు బాగా నడిపించాడు. ఓవరాల్ గా చూసుకుంటే దర్బార్ సినిమా రజిని స్థాయిలో హిట్ కావడం కాయం అన్నట్లుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి పండుగ ముందు రజనీకాంత్ అభిమానులందరికీ మంచి బిర్యానీ లాంటి సినిమా అని చెప్పొచ్చు. ఏదేమైనా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రజినీకాంత్ దర్బార్ సినిమాతో ఓ మంచి హిట్ కొట్టాడంతే...

మరింత సమాచారం తెలుసుకోండి: