సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. కాగా రజినీకాంత్ సరసన నయనతార కధానాయికగా నటించగా కూతురి పాత్రలో నివేత థామస్ నటించింది. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి.

 

ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఓకే పర్వాలేదని చెప్పొచ్చు.రజినీ స్టైల్ ను మురుగదాస్ పట్టుకొని మంచి మాస్ ఎలివేషన్ సీన్స్ తో ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ చేశాడు. ర‌జ‌నీ స్టైల్‌, న‌య‌న‌తార‌తో ప్రేమ స‌న్నివేశాలు,  యోగిబాబుతో కొన్ని కామెడీ సీన్స్ కానీ పలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ బాగుంటాయి. నివేతా థామస్ పాత్ర ఇంకా ఎంటర్ కాలేదు. అయితే ఈ ఇద్దరి కాంబో అంటే ఏదొక స్పెషల్ ఉండాలి కానీ అది మిస్సయ్యింది. 

 

అయితే ఇప్పటి వరకు ఓకే మరి మురుగదాస్ సెకండాఫ్ లో అయినా ఏమన్నా ఇంకా ఆసక్తికరంగా తెరకెక్కించారో లేదో అనేది చూడాలి. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు మంచి రిపోర్టే ఉంది. కాగా కథ పాతది అయినప్పటికీ ర‌జ‌నీ నుంచి ఎలాంటి సినిమా, స్టైల్‌, మేన‌రిజం ఉన్న సీన్లు ప్రేక్ష‌కులు ఆశిస్తారో అలాంటి సినిమాయే తీశాడు మురుగ‌దాస్. ప్ర‌తి సీన్‌లోనూ ద‌ర్శ‌కుడు త‌న‌దైన స్టైల్లో ర‌జ‌నీ మార్క్ మేన‌రిజం, ఉండేలా చూసుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 

ర‌జ‌నీ తెర‌మీద ఉన్నంత సేపు విజిల్స్ పడేలా సీన్స్ క్రియేట్ చేశారు.. చాలా రోజులు ఇంకా చెప్పాలంటే ఏళ్ల త‌ర్వాత ర‌జ‌నీ స్థాయికి ఆయ‌న ఫ్యాన్స్‌కు న‌చ్చిన సినిమా వ‌చ్చింది.. కాగా ఈ దర్బార్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి నిర్వహించారు. అనిరుధ్ అందించిన పాటలు మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. ఇప్పటివరకు వచ్చిన టాక్ అద్భుతం అని అంటున్నారు. మరి రెండో భాగం ఎలా ఉంది అనేది చూడాలి. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: